కాంగ్రెస్‌లోకి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. CM రేవంత్ రియాక్షన్ ఇదే!

by Disha Web Desk 2 |
కాంగ్రెస్‌లోకి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. CM రేవంత్ రియాక్షన్ ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: అధికార కాంగ్రెస్‌ పార్టీలో చేరికలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. శనివారం సచివాలయంలో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పార్టీలతో సంబంధం లేకుండా ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా నేరుగా సీఎంను కలవొచ్చు అని సూచించారు. గతంలో ముఖ్యమంత్రిని కలిసే అవకాశం సొంత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా ఉండేది కాదని గుర్తుచేశారు. కానీ, నేడు రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదని అన్నారు. పార్టీలకతీతంగా వచ్చి తనను కలిసి నియోజవర్గాల అభివృద్ధిపై చర్చించొచ్చు అని హితవు పలికారు. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనను మర్యాదపూర్వకంగా కలిశారని చెప్పారు.

వాళ్ల పార్టీకే అనుమానం ఉంటే తానేం చేయాలి అని ఎద్దేవా చేశారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరికకు సిద్ధంగా ఉన్నారనే విషయం తనకు తెలియదని.. ఆ విషయం తన దృష్టికి రాలేదని చెప్పారు. ఎవరైనా కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధంగా ఉంటే పార్టీదే తుది నిర్ణయం అని వెల్లడించారు. ముఖ్యంగా తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి.. 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని చేసిన కామెంట్స్‌పైనా సీఎం రేవంత్ స్పందించారు. జగ్గారెడ్డి వ్యాఖ్యలు పూర్తిగా తన దృష్టికి రాలేదని చెప్పారు. చేరికలు ఏవైనా పార్టీలో చర్చించాకే తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు.



Next Story

Most Viewed