‘స్వావలంభి భారత్ అభియాన్’ రాష్ట్రస్థాయి కార్యశాల ముగింపు

by Dishafeatures2 |
‘స్వావలంభి భారత్ అభియాన్’ రాష్ట్రస్థాయి కార్యశాల ముగింపు
X

దిశ, తెలంగాణ బ్యూరో : హైద్రాబాద్ మాదాపూర్ లోని సాంస్కృతిక వనరుల శిక్షణ కేంద్రం(సీసీఆర్‌టీ)లో రెండు రోజుల పాటు నిర్వహించిన స్వావలంభి భారత్ అభియాన్ రాష్ట్ర స్థాయి కార్యశాల ముగిసినట్లు తెలంగాణ ప్రాంత ప్రచార ప్రముఖ్ కేశవ సోని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కాగా దేశాభివృద్ధిలో ఆర్థిక స్వాతంత్ర్య స్వావలంబన దిశగా ముందుకెళ్లాడనికి ఈ కార్యక్రమం ఎంతగానో కృషి చేస్తుందని పలువురు వక్తలు తెలిపారు. పలు కార్యక్రమాల ద్వారా శిక్షణ కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు, కార్యశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలపైనే ఆధారపడకుండా స్వయం ఉపాధి వైపు మళ్లించేందుకు, వ్యాపార రంగంలో రాణించేందుకు కొత్త ఒరవడులు సృష్టించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, దేశమంతటా రోజ్ గార్ సృజన్ కేంద్రాలను ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసుకుంటున్నట్లు పలువురు వక్తలు తెలియజేశారు. కాగా పలువురు వక్తులు తాము ఏర్పాటుచేసుకున్న సూక్ష్మ-చిన్నతరహా పరిశ్రమల రంగాల్లో, పర్యాటక శాఖ అభివృద్ధిలో ప్రభుత్వ ప్రోత్సాహంతో ఏర్పాటుచేసుకున్న సంస్థల్లో ఉపాధి రంగం, ఆర్గానిక్ ఉత్పత్తుల్లో వ్యాపార అభివృద్ధి మెలకువలు, సహకార సంఘాల నిర్వహణలో పాటించాల్సిన పద్ధతులను గురించి వివరించారు.

రెండ్రోజుల పాటు జరిగిన రాష్ట్ర స్థాయి కార్యశాలలో 25 జిల్లాల నుంచి 200మంది పాల్గొన్నారు. కాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దక్షిణ మధ్య క్షేత్ర ప్రచార ప్రముఖ్ ఆయుష్ నడింపల్లి, స్వావలంభి భారత్ అభియాన్ దక్షిణ మధ్య భారత్ క్షేత్ర సమన్వయక్ డాక్టర్ సత్తు లింగమూర్తి, భారతీయ కిసాన్ సంఘ్ ప్రధాన కార్యదర్శి కుమార స్వామీ, స్వావలంభి భారత్ అభియాన్ తెలంగాణ ప్రాంత కన్వీనర్ ముక్కా హరీష్ బాబు, కో కన్వీనర్ గోటూరి రమేష్ గౌడ్, స్వదేశీ జాగరణ మంచ్ తెలంగాణ ప్రాంత కో కన్వీనర్లు అశోక్, ఈశ్వర్ తెలంగాణ ప్రాంత స్వదేశీ జాగరణ మంచ్ సంఘటనా మంత్రి రచ్చ శ్రీనివాస్, సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ వేణుగోపాల్ రావు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ జనరల్ సెక్రెటరీ అబ్దుల్ రెహ్మాన్, ఐఈడీసీ అధికారి శివరాం ప్రసాద్, ఆర్ డీపీ వర్క్ స్టేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు విక్రమ్ రెడ్లపల్లి, సామాజిక ఉద్యోగ ఉత్పత్తి రంగ నిపుణుడు కొత్త కృష్ణారెడ్డి, గ్రూప్ 1 ప్రభుత్వ అధికారి హరినందన్ పాల్గొన్నారు.



Next Story

Most Viewed