BRS ఎమ్మెల్సీలకు బిగ్ షాక్.. టికెట్ల కేటాయింపుపై కేసీఆర్ కీలక నిర్ణయం..!

by Disha Web Desk 19 |
BRS ఎమ్మెల్సీలకు బిగ్ షాక్.. టికెట్ల కేటాయింపుపై కేసీఆర్ కీలక నిర్ణయం..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు ఉవ్విళ్లూరుతున్నారు. అసెంబ్లీలో అడుగుపెట్టాలని భావిస్తున్నారు. ఈసారి ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలని ప్రయత్నాలు సైతం చేస్తున్నారు. వారి సొంత జిల్లాల్లో, సొంత నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. పార్టీతో పాటు పలు సేవాకార్యక్రమాలు, పార్టీ కార్యకర్తలు ఆహ్వానించే ప్రతి కార్యక్రమానికీ హాజరవుతూ ప్రజల్లో ఉంటున్నారు.

ఈ సారి టికెట్ తమకే వస్తుందని సన్నిహిత వర్గాలు, అనుచరులతో పేర్కొంటున్నారు. అలాంటి నేతలకు అధిష్టానం షాక్ ఇచ్చింది. ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు గులాబీ బాస్ నిరాకరించినట్టు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్‌లకు సహకరించాల్సిందేనని సూచించినట్టు సమాచారం.

ఈసారి కుదరదు

నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలు సుప్రీం కావడంతో ఎమ్మెల్సీలకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదు. ఏ కార్యక్రమం చేయాలన్నా ఎమ్మెల్యే అనుమతి తీసుకోవాల్సి వస్తుండటంతో వారిలో కొంత అసహనం నెలకొంది. కేడర్‌కు సైతం దూరం కావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే అయితే కేడర్‌తో పాటు ప్రజలకూ దగ్గర కావొచ్చని, నియోజకవర్గంలోనూ చక్రం తిప్పొచ్చన్నది వారి ఆలోచన.

అందుకోసం ప్రయత్నాలు చేస్తున్న టైంలోనే వారికి గులాబీ బాస్ కేసీఆర్ షాకిచ్చారు. ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పినట్టు సమాచారం. సిట్టింగులకే టికెట్స్ ఇస్తామని, వారి పనితీరు బాగోలేకపోతేనే ఎమ్మెల్సీలకు టికెట్ అని చెప్పినట్టు తెలిసింది. దీంతో పలువురు ఎమ్మెల్సీలు అసహనానికి లోనయ్యారు.

పనితీరుపైనా కేసీఆర్ నిఘా..?

ప్రజల్లో ఆదరణ ఉన్న నాయకులు పార్టీని వీడకుండా ఉండేందుకు వారికి ఎమ్మెల్సీ పదవులను అధిష్టానం కట్టబెట్టింది. పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారా? లేదంటే వర్గపోరుకు సహకరిస్తున్నారా? పార్టీ బలోపేతానికి వారు చేపడుతున్న చర్యలేంటి? అనే విషయాలపై కేసీఆర్ ఆరా తీస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో నియోజకవర్గాల వారీగా సర్వేలు నిర్వహిస్తూ.. ఎమ్మెల్సీల పనితీరునూ తెలుసుకుంటున్నట్టు సమాచారం.

ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న ఎమ్మెల్సీలు

పాడి కౌశిక్ రెడ్డి - హుజూరాబాద్

పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి - జనగాం

పట్నం మహేందర్ రెడ్డి - తాండూరు

కడియం శ్రీహరి - స్టేషన్ ఘన్ పూర్

కోటిరెడ్డి - నాగార్జునసాగర్

శేరి సుభాశ్ రెడ్డి - మెదక్

సత్యవతి రాథోడ్ -డోర్నకల్ లేక మహబూబాబాద్

శంభీపూర్ రాజు - కుత్బుల్లాపూర్

తాతామధు - ఖమ్మం

పల్లా రాజేశ్వర్ రెడ్డి - వరంగల్ పశ్చిమ

కూచుకుల్ల దామోదర్ రెడ్డి (కుమారుడి కోసం) - నాగర్ కర్నూల్

కసిరెడ్డి నారాయణరెడ్డి - కల్వకుర్తి

గుత్తా సుఖేందర్ రెడ్డి (కుమారుడికోసం)



Next Story

Most Viewed

    null