హాట్‌ టాపిక్‌గా మారిన కేసీఆర్ బిహార్ టూర్.. రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ!

by Dishanational2 |
హాట్‌ టాపిక్‌గా మారిన కేసీఆర్ బిహార్ టూర్.. రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ!
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్రంలోని బీజేపీయే లక్ష్యంగా ప్రాంతీయ పార్టీలన్నింటిని ఒకే గూటికి తీసుకొచ్చేందుకు కేసీఆర్ కసరత్తు ప్రారంభించారు. యాంటీ బీజేపీ ఫోర్స్ ను తయారు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు మొదలు పెట్టారు. అందులో భాగంగా బీజేపీ వ్యతిరేక పోరాటం కోసం గత ఐదారు నెలలుగా ప్రాంతీయ పార్టీలతో భేటీ అవుతున్నారు. తాజాగా బీజేపీకి బీహార్ సీఎం నితీష్ కుమార్ దూరం కావడంతో ఆయనతో భేటీ అయ్యి తాజారాజకీయాలపై చర్చించనున్నారు. వీరిద్దరి భేటీ రాజకీయా వర్గాల్లో చర్చనీయాంశమయ్యారు. తెలంగాణటు ఢిల్లీ వయా బీహార్ గా మారనుంది.

తెలంగాణ సీఎం కేసీఆర్ గణేష్ చతుర్దిని పురస్కరించుకొని జాతీయరాజకీయాలపై ఫోకస్ పెట్టారు. బీహార్ కు చెందిన సైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చిన్న అంశం అయినప్పటికీ దానిని బేస్ చేసుకొని జాతీయ రాజకీయాలను ప్రారంభించనున్నారు. అందులో భాగంగా ఆ రాష్ట్ర సీఎంతో భేటీ అయి తాజా రాజకీయాలను చర్చించనున్నారు. గత కొంతకాలంగా నితీష్ కుమార్ బీజేపీకి దగ్గర ఉండటంతో రాజకీయాలపై కేసీఆర్ తో ఆయనతో చర్చించారు. బీజేపీని విభేదించి బయటకు రావడంతో ఆయనతో కేసీఆర్ భేటీ చర్చనీయాంశమైంది. బీజేపీ అనుసరించే విధానాలను ఎలా తిప్పికొట్టాలనేదానిపై చర్చించనున్నారు. ఎలాంటి ప్రణాళికలు రూపొందించాలని, ఏ అంశంతో ముందుకు సాగాలి, అన్ని రాష్ట్రాల సీఎంలతో ఎప్పుడు భేటీ కావాలనే దానిపై సమిష్టిగా నిర్ణయం తీసుకొనున్నారు. ఇప్పటికే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రాంతీయ పార్టీలపై దూకుడు పెంచడం, ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోసి 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలదోసి బీజేపీ అధికారంలోకి వచ్చిన విధానాన్ని సైతం చర్చించనున్నట్లు సమాచారం. త్వరలోనే ఢిల్లీ, జార్ఖండ్, తమిళనాడు ప్రభుత్వాలపై దృష్టిసారించిందని అడ్డుకోకుండా అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు మనుగడ సాధ్యమని ఎలా చెక్ పెట్టాలనేదానిపై సుధీర్ఘంగా చర్చించనున్నారు. ఇప్పటివరకు జరిగిన చర్చలు ఒక రకమైతే బీహార్ నుంచి ఇప్పుడు మొదలు పెట్టే కార్యచరణ రానున్న కాలంలో మరిన్ని రాష్ట్రాలకు విస్తరించే అవకాశం ఉంది.

దేశంలో కేసీఆర్ ఇప్పటికే ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ (పశ్చిమ బెంగాల్‌), అర్వింద్‌ కేజ్రీవాల్‌ (ఢిల్లీ), సీఎం ఎంకే స్టాలిన్‌ (తమిళనాడు) సన్నిహితులు, తేజస్వీ యాదవ్‌ (ఆర్‌జేడీ, బీహార్‌), అఖిలేశ్‌ యాదవ్‌ (ఎస్‌పీ, యూపీ ప్రతిపక్ష నేత), శరద్‌ పవార్‌ (ఎన్సీపీ), భగవంత్ మాన్ (పంజాబ్) తో మాట్లాడిన విషయం తెలిసిందే. త్వరలోనే మరోసారి భేటీ కానున్నట్లు సమాచారం. బీహార్ పర్యటనలో మాజీ సీఎం లాలు ప్రసాద్ యాదవ్ తో పాటు ఆయన కుమారుడు డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ తో సైతం భేటీ కానున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపై సాగితేనే బీజేపీ ఎదుర్కోగలమనే నిర్ణయాన్ని బీహార్ పర్యటనలో సమిష్టిగా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

టార్గెట్ 2024 ఎన్నికలు..

2024 సాధారణ ఎన్నికలే టార్గెట్ గా కేసీఆర్ పావులు కదుపుతున్నారు. అప్పటివరకు దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఒక గూటికి తీసుకొచ్చేందుకు ముమ్మరప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగానే అక్టోబర్, నవంబర్ నెలల్లో బీహార్, యూపీ, ఎంపీ, మహారాష్ట్ర, హరియాణా, పంజాబ్, బీహార్, గుజరాత్ లో రైతు సదస్సులు నిర్వహించేలా సన్నద్ధం చేస్తున్నారు. ఇప్పటికే రైతుసంఘాలతో భేటీ నిర్వహించిన కేసీఆర్ రాబోయే ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లో వారినే అభ్యర్థిగా బరిలో నిలిపే అవకాశం ఉంది. బీజేపీ పాలిత రాష్ట్రాలన్నింటిలో రైతుసంఘం నేతలను బరిలో నిలిపి సత్తాచాటాలని భావిస్తున్నట్లు సమాచారం. ఏదీ ఏమైనప్పటికీ రానున్న కాలంలో కేసీఆర్ తీసుకునే నిర్ణయాలు జాతీయ రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు దారితీస్తుందోనని చర్చనీయాంశంగా మారింది.

బీహార్ కు బయల్దేరిన కేసీఆర్..

బీహార్ పర్యటన కోసం ప్రగతి భవన్ నుంచి పాట్నా కు ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ బయల్దేరారు. గతంలో ప్రకటించిన మేరకు, గాల్వాన్ ఘర్షణల్లో అమరులైన 5 గురు బీహార్ కు చెందిన భారత సైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయనున్నారు. సైనిక కుటుంబాలతో పాటుఇటీవలి, సికింద్రాబాద్ టింబర్ డిపో అగ్ని ప్రమాదంలో చనిపోయిన 12 మంది బీహార్ వలస కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తారు. అమరులైన ఒక్కో సైనిక కుటుంబానికి రూ.10 లక్షలు, మరణించిన ఒక్కో వలస కార్మిక కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కులను బీహార్ సీఎం నితీష్ కుమార్ తో కలిసి చెక్కులు పంపిణీ చేయనున్నారు. మధ్యాహ్నం లంచ్ కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొననున్నారు. అనంతరం జాతీయ రాజకీయాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. తిరిగి రాత్రి 7.30 గంటలకు రాష్ట్రానికి రానున్నారు. కేసీఆర్ వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, రైతు బంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ రెడ్డి,కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్, జాతీయ రైతు సంఘాల నేతలుఉన్నారు.

మంత్రి హరీశ్ రావును బర్తరఫ్ చేయాల్సిందే: రేవంత్

Next Story

Most Viewed