ఢిల్లీ లిక్కర్ స్కామ్.. ఎల్లుండి ఈడీ విచారణకు కవిత

by Dishanational2 |
ఢిల్లీ లిక్కర్ స్కామ్.. ఎల్లుండి ఈడీ విచారణకు కవిత
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఫస్ట్ టైమ్ ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎంక్వయిరీకి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరవుతున్నారు. ఢిల్లీలోని సెంట్రల్ ఆఫీసులో ఈ నెల 11న హాజరు కానున్నట్లు ఈడీ జాయింట్ డైరెక్టర్‌కు కవిత రాతపూర్వకంగా సమాచారం ఇచ్చారు. ఈడీ జారీ చేసిన నోటీసుల ప్రకారం గురువారమే విచారణకు హాజరుకావాల్సి ఉన్నదని, కానీ ప్రీ-షెడ్యూలు మీటింగులతో సాధ్యం కాదని పేర్కొన్న కవిత 11న అటెండ్ అవుతున్నట్లు డేట్ ఫిక్స్ చేశారు. కోర్టులు గతంలో ఇచ్చిన పలు తీర్పుల ప్రకారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈడీ విచారించే అవకాశం ఉన్నప్పటికీ నేరుగా కార్యాలయానికి రావాలని ఆదేశించడంలో ఆంతర్యం ఏంటని ఆ లేకలో ప్రశ్నించారు. ఒక మహిళగా తన నివాసంలో విచారించాలని కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఆమె గుర్తుచేశారు.

మద్యం కుంభకోణం దర్యాప్తులో భాగంగా కల్వకుంట్ల కవితకు ఈడీ బుధవారం జారీచేసిన నోటీసు ప్రకారం గురువారమే ఎంక్వయిరీకి హాజరుకావాల్సి ఉన్నది. కానీ మహిళా రిజర్వేషన్ బిల్లు డిమాండ్‌తో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో శుక్రవారం తలపెట్టిన దీక్షను దృష్టిలో పెట్టుకుని 15న లేదా ఆ తర్వాత వస్తానని మెయిల్ ద్వారా ఈడీకి సమాచారం ఇచ్చారు. కానీ ఈడీ నుంచి స్పందన రాకపోవడంతో రాత్రి పొద్దుపోయిన తర్వాత 11వ తేదీన హాజరుకానున్నట్లు జాయింట్ డైరెక్టర్‌కు క్లారిటీ ఇచ్చారు. జంతర్‌మంతర్ దీక్షలో 10న పాల్గొన్న మరుసటి రోజు ఈడీ ఆఫీసులో హాజరు కానున్నారు. కవిత సన్నిహితుడు అరుణ్ రామచంద్రన్ పిళ్లయ్‌ స్వయంగా తాను బినామీ అంటూ స్టేట్‌మెంట్ ఇవ్వడం, ఈడీ అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్న మరుసటి రోజునే కవితకు ఈడీ నోటీసు జారీచేయడం గమనార్హం.

పిళ్లయ్‌తో కలిసి జాయింట్ ఎంక్వయిరీ?

లిక్కర్ స్కామ్‌లో కవిత పేరును పిళ్లయ్ ప్రస్తావించి బినామీగా అంగీకరించడ,తో ఇద్దరినీ కలిపి జాయింట్‌గా విచారించాలని ఈడీ భావిస్తున్నట్లు సమాచారం. ఢిల్లీలోని రౌజ్ ఎవెన్యూ కోర్టు అనుమతి మేరకు పిళ్లయ్‌ ఈడీ కస్టడీ ఈ నెల 13న ముగియనున్నది. ఆ లోపే కవితను ఎంక్వయిరీ చేస్తుండడం విశేషం. కవిత తొలుత పేర్కొన్నట్లు ఈ నెల 15 వరకు ఆగితే ఇద్దరినీ జాయింట్‌గా విచారించటం వీలుపడదు. కవిత రిక్వెస్టుపై ఈడీ స్పందించకపోవడంతో స్వయంగా మె చొరవ తీసుకుని ఈనెల 11న హాజరు అవుతున్నట్లు క్లారిటీ ఇచ్చారు.

జంతర్ మంతర్ వద్ద దీక్షకు..

జంతర్మంతర్ధర్నా నేపథ్యంలో కవిత బుధవారం రాత్రి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. గతంలో సీబీఐ నోటీసులు ఇచ్చినపుడు ఆమె విచారణకు ముందు ప్రగతి భవన్లో తన తండ్రి సీఎం కేసీఆర్ ను కలిసినది తెలిసిందే. ఈసారి కూడా కవిత తన తండ్రిని కలుస్తుందని జోరుగా ప్రచారం జరిగింది. కాగా, గతంలో ప్రగతి భవన్లో కేసీఆర్ను కలిసినపుడు ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. స్కామ్ లో ఉన్నట్టుగా భావిస్తున్న కవిత ప్రగతి భవన్కు వెళ్లటమేంటి? సీఎంను కలవటమేంటి? అంటూ పలువురు ప్రతిపక్ష నేతలు ధ్వజమెత్తారు. దీంతో ఈసారి కవిత తన తండ్రిని కలవలేదు. కానీ.. ఫోన్లో మాట్లాడింది. తన కూతురికి కేసీఆర్ధైర్యం చెప్పినట్టు సమాచారం. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. న్యాయపరంగా బీజేపీ అకృత్యాలపై పోరాడుదామని.. పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పినట్టు తెలిసింది.

హడావిడి నోటీసుల ఆంతర్యమేంటి?

తగిన సమయం ఇవ్వకుండా హడావిడిగా దర్యాప్తు చేయాలన్న ఈడీ తీరును కల్వకుంట్ల కవిత తప్పుపట్టారు. స్వల్ప కాలంలో విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేయడం వెనక ఉద్దేశం అర్థం కావడం లేదని జాయింట్ డైరెక్టర్‌కు బుధవారం అర్ధరాత్రి రాసిన లేఖలో వ్యాఖ్యానించారు. ఈ దర్యాప్తుతో తాను చేసేదేమీ లేదని, రాజకీయ కక్షలో భాగంగానే ఇదంతా చేస్తున్నట్లు స్పష్టమవుతున్నదన్నారు. బాధ్యత కలిగిన పౌరురాలిగా, ఒక మహిళగా చట్టపరమైన అన్ని హక్కులను తాను ఉపయోగించుకుంటానని అన్నారు. కోర్టులు గతంలో ఇచ్చిన తీర్పుల ప్రకారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించే అవకాశం ఉన్నప్పటికీ నేరుగా ఈడి కార్యాలయానికి రావాలంటూ నోటీసులు ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటన్న సందేహాన్ని కవిత వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి :

కవితకు ఈడీ నోటీసులు: రేవంత్ రెడ్డి మౌనమెందుకు?


Next Story

Most Viewed