BREAKING: కవితకు బ్యాడ్ లక్.. మరోసారి జ్యుడిషియల్ కస్టడీ పొడగింపు

by Disha Web Desk 19 |
BREAKING: కవితకు బ్యాడ్ లక్.. మరోసారి జ్యుడిషియల్ కస్టడీ పొడగింపు
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మరోసారి పొడిగించింది. దీంతో మే 7 వరకు ఆమె జ్యుడిషియల్ కస్టడీలో ఉండనున్నారు. కాగా, కవిత జ్యుడిషియల్ కస్టడీ ఇవాళ్టితో ముగియడంతో అధికారులు ఆమెను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపర్చారు. మరో 14 రోజుల పాటు కవిత కస్టడీ పొడిగించాలని సీబీఐ, ఈడీ అప్లికేషన్లు దాఖలు చేశాయి. ఈ సందర్భంగా కవిత జ్యుడిషియల్ కస్టడీపై వాదనలు జరిగాయి. కొత్త అంశాలను ఏమి ఈడీ జత చెయ్యలేదని, కస్టడీ అవసరం లేదంటూ కవిత తరపు న్యాయవాది వాదించారు.

కేసు విచారణ కీలక దశలో ఉన్నదని, ఈ సమయంలో సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, కేసు విచారణ పురోగతిపై ప్రభావం ఉంటుంది కాబట్టి కస్టడీ పొడిగించాలని ఈడీ తరుఫు న్యాయవాది కోరారు. సాక్ష్యాలను తారుమారు చేస్తారని అరెస్ట్ చేసిన రోజునుంచి ఆరోపిస్తున్నారు, కొత్తగా ఏం చెప్పడం లేదంటూ కవిత తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు ఈడీ సమర్పించింది. 60 రోజుల్లో కవిత అరెస్ట్‌పై చార్జిషీట్ సమర్పిస్తామని ఈడీ కోర్టుకు తెలిపింది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. దర్యా్ప్తు సంస్థ వాదనలతో ఏకీభవించి కవిత జ్యుడిషియల్ కస్టడీని మరో 14 రోజులు పొడగించింది.



Next Story

Most Viewed