మహిళ భద్రతే 'షీ టీమ్స్ ' లక్ష్యం': జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

by Shiva Kumar |
మహిళ భద్రతే షీ టీమ్స్  లక్ష్యం: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: మహిళ భద్రతే 'షీ టీమ్' లక్ష్యమని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని సాయి మణికంఠ ఫంక్షన్ హాల్ లో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళ భద్రతే 'షీ టీమ్' లక్ష్యం అనే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థినులకు ఉమెన్ సేఫ్టీ, సైబర్ క్రైమ్స్, ఆన్లైన్ ఫ్రాడ్స్ ఇతర అంశాలపై అవగాహన కల్పిస్తూ వారిని చైతన్య పరచాలనే ఉద్దేశంతో కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.

రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి దేశంలో ఎక్కడ లేని విధంగా మహిళల రక్షణ, భద్రతకు ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ప్రతి జిల్లాలో షీ టీమ్స్ ఏర్పాటు చేశారని తెలిపారు. మహిళా సురక్షిత అంటే మహిళలకు మాత్రమే బాధ్యత కాదు ఇది అందరి బాధ్యత అని తెలిపారు. విద్యార్థులు, మహిళలను ఎవరైనా ఇబ్బందులకు గురి చేసినా జిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425కు సమాచారం అందజేయాలన్నారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. మైనర్ బాలికల పై ఎవరైనా లైంగిక వేధింపులకు పాల్పడితే ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేస్తామని తెలిపారు.

విద్యార్ధినులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని, ప్రస్తుతం మహిళలపై వేధింపులు అఘాయిత్యాలు, సోషల్ మీడియా, ఆన్ లైన్ లోనే ఎక్కువ మోసాలు జరుగుతున్నాయని తెలిపారు. విద్యార్థి దశ నుంచే ఉన్నత లక్ష్యాన్ని పెట్టుకొని క్రమశిక్షణ పట్టుదల ఓపికతో కష్టపడినప్పుడు మంచి విజయాలు సాధిస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ విస్వప్రసాద్, సీఐ అనిల్ కుమార్, ఎంఈవో రఘుపతి, షీ టీం ఎస్.ఐ ప్రేమ్ దీప్, ఎస్.ఐ లు రాజు, శ్రీకాంత్, ఉపాధ్యాయినులు, షీ టీం సిబ్బంది, తదిలరుల పాల్గొన్నారు.

Next Story

Most Viewed