రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు ఏమైంది : రెడ్డి సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఏ.రాంరెడ్డి

by Disha Web Desk 1 |
రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు ఏమైంది : రెడ్డి సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఏ.రాంరెడ్డి
X

దిశ, కరీంనగర్ టౌన్ : గత ఎన్నికలకు ముందు సీఎం కేసిఆర్ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని, ఐదేళ్లైనా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం లేదంటూ రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టామని జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అప్పమ్మగారి రాంరెడ్డి అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. అన్ని కులాల్లో పేదలు ఉన్నారని, వారిని ఆదుకోవాల్సిన భాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ఎన్నికల ముందు ఓట్ల కోసం మాటిచ్చి ఐదేళ్లైనా కార్పొరేషన్ ఏర్పాటు చేయకుండా దాటవేస్తున్నారని ఆరోపించారు. వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోతే రెడ్డిల సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు.

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు కనీసం రూ.20 వేలు నష్ట పరిహారం చెల్లించాలని, తడిసిన ధాన్యాన్ని షరతులు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసి రాష్ట్ర నాయకులు పెండ్యాల రాంరెడ్డి, కూర మహిపాల్ రెడ్డి, చాడ రవీందర్ రెడ్డి, రాజిరెడ్డి, ఆర్జీవీఆర్ జిల్లా అధ్యక్షుడు నరహరి జగ్గారెడ్డి, కార్యదర్శి బండ గోపాల్ రెడ్డి, పెండ్యాల కేశవరెడ్డి, దన్యాకుల శ్రీనివాస్ రెడ్డి, మధుకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed