రామగుండం ను అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నాం : ఎమ్మెల్యే కోరుకంటి చందర్

by Disha Web Desk 1 |
రామగుండం ను అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నాం : ఎమ్మెల్యే కోరుకంటి చందర్
X

దిశ, గోదావరి ఖని : సీఎం కేసీఆర్ నాయకత్వంలో రామగుండం ను అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నామని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. బీఆర్ఎస్ అవిర్బావ దినోత్సవాన్ని జీఎం కాలనీ మైదానంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఐదువేల మంది కార్యకర్తలతో రామగుండం ప్రారిశ్రామిక ప్రాంతమంతా గులాబీమయంగా మారింది. సభా ప్రాంగణంలో ముందుగా బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎమ్మెల్యే కోరుకంటి చందర్, జిల్లా ఇన్ చార్జి ఎర్రోళ్ల శ్రీనివాస్ అవిష్కరించారు. అనంతరం తెలంగాణ తల్లికి పూలమాల వేసి తెలంగాణ ఆమరవీరులకు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని అనేక సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని అన్నారు. దేశానికే దిక్సూచిగా తెలంగాణ నిలిచిందన్నారు. తెలంగాణ సాధన కోసం 14 ఏళ్లు అలుపెరగని పోరాటం సాగించానమని, ప్రజలను ఒక్కతాటిపైకి తెచ్చి పోరాటాన్ని చేశామని ఎన్నో కేసులతో జైలు జీవితం గడిపామని తెలిపారు. తెలంగాణలో ఆకలిచావులు, ఆత్మహత్యలు లేవని ధర్నాలు, సమ్మెలు లేకుండా సస్యశ్యామలంగా విరాజిల్లుతోందన్నారు. విద్యా వ్యవస్థ ప్రక్షాళన జరగాలని గురుకులాలను ఏర్పాటు చేసిన నాయకుడు కేసీఆర్ అన్నారు.

ప్రస్తుతం రాష్ట్ర జీడీపీ 12 నుంచి 13.2 కి పెరిగి దేశ జీడీపీలో 10.3 కు తగ్గింది అంటే సీఎం కేసీఆర్ పాలన ఎలాంటిదో తెలుస్తుందన్నారు. రైతు సంక్షేమానికి సీఎం ప్రాముఖ్యత ఇచ్చారన్నారు. తూర్పున ప్రవహిస్తున్న గోదావరి నీళ్లను ఒడిసి పట్టి ఎంతో గోప్పగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి రాష్ట్రానికి నిల్లందిస్తున్న జల ప్రధాత కేసీఆర్ అన్నారు. రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువేళ్తున్నమని చెప్పారు. రామగుండం ప్రజల దశాబ్ధాల కళ మెడికల్ కళాశాలను సీఎం కేసీఆర్‌ మంజూరు చేయించారని తెలపారు. వైద్య కళాశాల ఎర్పాటుతో కార్ఫోరేట్ వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు.

గోదావరి ఖని పట్టణంలో సివిల్ కోర్టు ఎర్పాటు చేయుంచామన్నారు. లింగపూర్ కుందనపల్లి వీలీన గ్రామాలకి విముక్తి కల్గించామన్నారు. ఎన్నో ఎళ్లుగా పెండింగ్ లో ఉన్న కుందనపల్లి రైల్వే ఓవర్ బిడ్జిని పనులు ప్రారంభించామని తెలిపారు. రామగుండం నియోజకవర్గానికి పంట పోలాలకు సాగునీరు అందించేందుకు బ్రాహ్మణపల్లి వద్ద రూ.80 కోట్లతో లిప్ట్ ఎర్పాటు చేశారని తెలిపారు. 27ఎల్, 16 ఎల్ ద్వారా ప్రతి పోలానికి సాగునీరు అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేక్ రావు, అంతర్గం జడ్పీటీసీ ఆముల నారాయణ, ఎంపీపీలు దుర్గం విజయ, వాల్య అనసూర్య రాంరెడ్డి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు మూల విజయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed