జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్పీని కలిసిన ఇతనాల్ బాధితులు..

by Disha Web Desk 20 |
జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్పీని కలిసిన ఇతనాల్ బాధితులు..
X

దిశ, వెల్గటూర్ : వెల్గటూర్ మండలం పాషిగాం గ్రామంలో ఏర్పాటు చేస్తున్న ఇతనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా స్తంభంపల్లి పాషిగాం గ్రామాల ప్రజలు మైసమ్మ బోనాల సందర్భంగా పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారని కొంతమంది యువకులు, మహిళల పై పోలీసులు రెండు రోజుల క్రితం తప్పుడు కేసులు నమోదు చేశారు. పోలీసులు పెట్టిన తప్పుడు కేసులను నిరసిస్తూ పలువురు యువకులు బుధవారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డీసీసీ అధ్యక్షులు అడ్డూరి లక్ష్మణ్ కుమార్ ను కలిసి విన్నవించు కున్నారు. అనంతరం జీవన్ రెడ్డి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ భాస్కర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఇత నాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ స్తంభంపల్లి, పాషిగాం గ్రామాల్లో ప్రజలందరూ మైసమ్మ బోనాలు చేసి ఇటీవల నిరసన వ్యక్తం చేశారు.

ఇతనాల్ ఫాక్టరీ నిర్మించే ప్రదేశంలో ఉన్న మైసమ్మ తల్లి వద్దకు సామూహిక బోనాలతో వెళ్లకుండా ప్రజలను పోలీసులు రోప్ వలయాలు నిర్మించి ఎక్కడి కక్కడ కట్టడి చేశారు. తమ బోనాలు కింద పడేసి అవమానించారు. ఈ క్రమంలో పోలీసులు ప్రజల మధ్యన తోపులాట జరిగింది. అయినా పోలీసులను ప్రజలు దూషించలేదు, దాడి చేయలేదు. పోలీసుల పై ప్రజలు దాడి చేశారని రెండు గ్రామాల్లోని కొంతమంది వ్యక్తులపై వెల్గటూర్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు. మా ప్రాణాలను హరించే ఇతనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగామాట్లాడు తున్న మా గొంతు నొక్క డానికి పోలీసులు కక్షతో తమపై కేసులునమోదు చేశారని ఇత నాల్ బాధితులు ఎస్పీకి విన్నవించారు.

దీనిపై తగిన విధంగా విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని ఎస్పీకి ఇచ్చిన వినతి పత్రంలో విజ్ఞప్తి చేశారు. ఇతనాల్ బాధితులు ఇచ్చిన ఫిర్యాదు పై సాను కూలంగా స్పందించిన ఎస్పీ భాస్కర్ మైసమ్మ బోనాలకు సంబంధించిన వీడియో ఫుటేజ్ లు పరిశీలించి పూర్తిస్థాయిలో విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన్నట్లు బాధితులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెల్గటూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శైలేందర్ రెడ్డి, ధర్మపురి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాందెనిమొగిలి, బరుపటి జనార్ధన్, మల్లేశ్, మహేష్, గోపతి నరేష్ , కంటెం అంజి కంటెం రాజు, అల్లం సాయి, ఎంబడి శ్రీధర్, ఎంబడి అనిల్, కొట్టే రవి తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed