స్తంభం వేశారు.. కనెక్షన్ ఇవ్వడం మరిచారు..

by Disha Web Desk 23 |
స్తంభం వేశారు.. కనెక్షన్ ఇవ్వడం మరిచారు..
X

దిశ, రామడుగు : ప్రమాదకరంగా ఉన్న ఇనుప స్తంభాలను గుర్తించి వాటి స్థానంలో మరో స్తంభాన్ని ఏర్పాటు చేశారు. కానీ కలెక్షన్ ఇవ్వడం మరిచారు. రామడుగు మండల కేంద్రంలో మూడో వార్డులో డ్రైనేజీలో తుప్పు పట్టి కింద పడిపోయే స్థితిలో ఉన్న కరెంటు స్తంభాన్ని పట్టించుకున్న నాధుడే కరువయ్యాడు. సంవత్సరం క్రితం ప్రమాదం గా ఉన్నదని గుర్తించిన విద్యుత్ సిబ్బంది దాని స్థానంలో మరో స్తంభాన్ని ఏర్పాటు చేశారు కానీ దానికి కనెక్షన్ ఇవ్వడం మరిచినట్లుగానే ఉన్నది. నెలలు గడుస్తున్న ఇనుప ఫోలు తుప్పు పట్టి పడిపోయే స్థితిలో ఉన్న విద్యుత్ అధికారులు మాత్రం ఇటువైపు కన్నెత్తి చూడటం లేదని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరెంట్ బిల్లు సమయానికి కట్టకుంటే విద్యుత్ కనెక్షన్ నిలిపివేస్తున్నారే తప్ప కాలనీలో ఎప్పుడు కింద పడిపోతుందో తెలియని విద్యుత్ స్తంభాన్ని ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా విద్యుత్ అధికారులు ఇనుప స్తంభాన్ని తొలగించి దాని స్థానంలో ఏర్పాటు చేసిన మరో స్తంభానికి కనెక్షన్ ఇవ్వవలసిందిగా కోరుతున్నారు.


Next Story