మట్టి తరలిస్తున్న టిప్పర్లు, లారీలను అడ్డుకున్న సిర్సపల్లి గ్రామస్తులు..

by Disha Web Desk 20 |
మట్టి తరలిస్తున్న టిప్పర్లు, లారీలను అడ్డుకున్న సిర్సపల్లి గ్రామస్తులు..
X

దిశ, హుజూరాబాద్ : అక్రమంగా మట్టి తరలిస్తున్న మూడు టిప్పర్లు, 4 ఇసుక ట్రాక్టర్లను సిర్సపల్లి గ్రామస్తులు అడ్డుకొని రోడ్డుపై బైఠాయించారు. వీణవంక ప్రాంతం నుంచి వస్తున్న ఇసుక లారీలు, ట్రాక్టర్లు, మట్టి తరలిస్తున్న టిప్పర్లతో రోడ్లు దెబ్బ తినడంతో పాటు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ గ్రామస్తులు ఆదివారం వాటిని అడ్డుకోవడంతో వాహనాలు నిలిచిపోయి అంతరాయం వాటిల్లింది. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మట్టి తరలిస్తున్న 3 టిప్పర్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఇసుక లారీల ధ్రువీకరణ, రవాణాకు సంబంధించిన పత్రాలను పరిశీలించు వదిలి పెట్టారు. అనంతరం ఎస్సై రాజన్న మాట్లాడుతూ అక్రమంగా మట్టి, ఇసుక తరలించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా ఇసుక రవాణా జరుగుతున్న తీరుపై నియిజకవర్గంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేఖత వ్యక్తమవుతోంది. జమ్మికుంట మండలం తనుగుల, గండ్రపల్లి రోడ్డు పూర్తిగా దెబ్బతిని ద్విచక్ర వాహనంపై వెళ్ళడానికి కూడ తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇసుక రవాణా వెనుక బడా వ్యక్తుల హస్తం ఉండటంతోనే అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.



Next Story

Most Viewed