విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయురాలు.. ప్రైవేటు స్కూల్ కు వెళ్లమంటూ హుకూం

by Disha Web Desk 1 |
విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయురాలు.. ప్రైవేటు స్కూల్ కు వెళ్లమంటూ హుకూం
X

దిశ, రామడుగు: చిన్నారులను అపురూపంగా చూసుకుంటూ ఓపికతో వారికి విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయురాలు విద్యార్థిని చితకబాదిన ఘటన మండల పరిధిలోని గుండి గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి చూసింది. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో అజ్మత్ అనే విద్యార్థి నాలుగో తరగతి చదువున్నాడు. ప్రస్తుతం పాఠశాలలో వార్షిక పరీక్షలు కూడా కొనసాగుతున్నాయి.

ఈ క్రమంలోనే గురువారం పాఠశాలకు వచ్చిన ఓ ఉపాధ్యాయురాలు అజ్మత్ అనే విద్యార్థి సరిగ్గా చదవడం లేదంటూ కర్రతో దారుణంగా చితకబాదింది. దీంతో అజ్మత్ ఎడమ చేతిపై చర్మం మొత్తం కమిలిపోయి గాయమైంది. ఈ ఘటనపై తల్లిదండ్రులు సదరు ఉపాధ్యాయురాలిని వివరణ కోరగా బాబు సరిగ్గా చదవడం లేదని ప్రైవేటు పాఠశాలకు వెళ్లండంటూ హుకుం జారీ చేశారని వారు వాపోయారు.

నిరుపేదలైన తల్లిదండ్రులకు ఆర్థిక స్థోమత లేకే.. ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తే అక్కడ తమ అబ్బాయిని ఇష్టానుసారంగా బాదుతూ ప్రైవేటు పాఠశాలకు వెళ్లమని చెప్పడం దారుణమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారి విచారణ జరిపి సదరు ఉపాధ్యాయురాలిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.



Next Story

Most Viewed