'చిరుజల్లులకే తెగిపోతున్నాయి.. ప్రజాధనం దుర్వినియోగం'

by Disha Web Desk 13 |
చిరుజల్లులకే తెగిపోతున్నాయి.. ప్రజాధనం దుర్వినియోగం
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అగ్రహారం, ఆవునూరు మధ్యగల చెక్ డ్యామ్ అసంపూర్తిగా నాణ్యత లేకుండా నిర్మాణం చేశారని రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి గుంటి వేణు సీపీఐ నాయకులు సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చెక్ డ్యామ్ అసంపూర్తిగా ఉందని దానిని మళ్లీ పునర్ నిర్మించాలని తెలిపారు. నిర్మాణానికి సంబంధించిన కాంట్రాక్టర్‌లు.. ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు పెడుతుందని చెబుతున్నారు.. కానీ సదరు కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలు చేపట్టకుండా చిరుజల్లులకే తెగిపోతున్నాయని ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని పేర్కొన్నారు. రైతుల కోసం చెక్ డ్యామ్‌లో నిర్మిస్తున్నారా కాంట్రాక్టర్లు ప్రయోజనాల కోసం నిర్మిస్తున్నారా..? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సదర్ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకుని మళ్లీ పునర్నిర్మానం చేపట్టాలని డిమాండ్ చేశారు.


కాంట్రాక్టర్ యొక్క లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం రోజున మంత్రి పర్యటన నేపథ్యంలో ఆయన దృష్టికి తీసుకువెళ్లాలని సిపిఐ నాయకులు కోరారు. రైతుల ప్రయోజనాల కోసం ప్రజల డబ్బు ఉపయోగించాలి కానీ దుర్వినియోగం చేయకుండా ఇష్టానుసారం ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వెంకటాపురం గ్రామపంచాయతీ ని సందర్శిస్తున్న నేపథ్యంలో చెక్ డ్యాం కూడా మంత్రి కేటీఆర్ సందర్శించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజన్న జిల్లా సీపీఐ కార్యదర్శి గుంటి వేణు, కార్యవర్గ సభ్యులు సీపీఐ బుర్ర మల్లేశం, మంత్రి చంద్రయ్య జంగం అంజన్న, మంచి కట్ల రమేష్, వడ్డేపల్లి లక్ష్మణ్ సోమ నాగరాజు, మాట్ల అశోక్, గజ్జల ప్రభాకర్, సీపీఐ నాయకులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed