- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
అత్యాచారం ఫిర్యాదును వెనక్కి తీసుకున్న సందేశ్‌ఖాలీ మహిళ
దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్‌లో సందేశ్‌ఖాలీ అంశం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ వ్యవహారమంతా బీజేపీ చేసిన కుట్రేనని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. తాజాగా సందేశ్‌ఖాలీకి చెందిన ఓ మహిళ టీఎంసీ నేతలపై చేసిన ఫిర్యాదులను వెనక్కి తీసుకున్నారు. తమపై అత్యాచారం చేశారంటూ చేసిన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నామని, తాను ఎలాంటి వేధింపులకు గురవలేదని, స్థానిక బీజేపీ నేతలు తనతో బలవంతంగా తెల్ల కాగితంపై సంతం చేయించుకున్నట్టు ఆమె స్పష్టం చేశారు. 'బీజేపీ మహిళా మోర్చా విభాగానికి చెందిన కొందరు అప్పుడు మా ఇంటికి వచ్చారు. పీఎంఏవైలో పేరును చేరుస్తామనే కారణంతో తెల్ల కాగితంపై నా సంతకం తీసుకున్నారు. ఆ తర్వాత పోలీసు స్టేషన్‌లో టీఎంసీ నేతలపై అత్యాచారం కేసు వేయించారు. తానెప్పుడూ రాత్రి సమయంలో ఆ పార్టీ ఆఫీసుకు వెళ్లలేదు. తాను ఎలాంటి వేధింపులకు గురి కాలేదని ' ఆమె వివరించారు. తన తప్పు తెలుసుకుని కేసును వెనక్కి తీసుకుంటున్నాను. ఇది తెలుసుకున్న కొందరు బీజేపీ నేతలు తనను బెదిరిస్తున్నారని, రక్షణ కావాలని సదరు మహిళ కోరారు. కాగా, సందేశ్‌ఖాలి వ్యవహారంలో బీజేపీ కుట్ర చేసిందని, ఇటీవల ఓ స్టింగ్ ఆపరేషన్ వీడియోను టీఎంసీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. మరోవైపు, సందేశ్‌ఖాలీ విషయంపై టీఎంసీ కేంద్ర ఎన్నికల సంఘం ముందుకెళ్లింది. వీడియో ఆధారంగా బీజేపీ నేత సువేందు, ఇతరులపై ఫిర్యాదు చేస్తున్నట్టు టీఎంసీ పేర్కొంది.