ఇండ్ల కోసం నిరుపేదల పోరాటం..

by Disha Web Desk 20 |
ఇండ్ల కోసం నిరుపేదల పోరాటం..
X

దిశ, కోరుట్ల : కోరుట్ల పట్టణంలోని సర్వే నంబర్ 922, 923లోని ప్రభుత్వ భూమిలో పేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని సీపీఎం ఆధ్వర్యంలో చేస్తున్న ఆందోళన గురువారం నాల్గొవ రోజుకు చేరింది. గురువారం ఉదయం పెద్దసంఖ్యలో పేదలు జంబి గద్దె పక్కన ఉన్న ప్రభుత్వ భూమిలోని స్థలాల వద్దకు వచ్చి భూమిని చదును చేసి గుడిసెలు వేసుకునేందుకు ప్రయత్నించగా, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్బంగా సీపీఎం జిల్లా కన్వీనర్ తిరుపతి నాయక్ మాట్లాడుతూ తమకు గూడు కల్పించాలని పేదలు వేసుకున్న గుడిసెలను రెవెన్యూ సిబ్బంది, పోలీసులు తగలబెట్టడం సరికాదన్నారు.

కోరుట్లలో వేలాదిగా నిరుపేదలు ఇండ్లు లేక కిరాయిలు ఉంటూ అనేక ఇబ్బందులతో జీవనం సాగిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ భూమిలో అర్హులైన పేదలందరికి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. గుడిసెలు వేసుకునేందుకు వచ్చిన వారు ఎవరికి భయపడకుండా ఉండాలని, సీపీఎం నాయకత్వంలో ప్రభుత్వ స్థలంలో పేదలకు ఇండ్లు కట్టించేంత వరకు పోరాటం కొనసాగిస్తామని అన్నారు. అరెస్టులతో తమ ఉద్యమాన్ని అణిచివేయలేరని, పేదలకు న్యాయం జరిగేంత వరకు ఉద్యమిస్తామని అన్నారు. కాగా పలువురు సిపిఎం నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.



Next Story

Most Viewed