కరీంనగర్ కు ఆధ్యాత్మిక శోభ : మంత్రి గంగుల కమలాకర్

by Disha Web Desk 1 |
కరీంనగర్ కు ఆధ్యాత్మిక శోభ : మంత్రి గంగుల కమలాకర్
X

టీటీడీ సహకారంతో రూ.20 కోట్లతో 10 ఎకరాల్లో వెంకన్న ఆలయ నిర్మాణం

31న టీటీడీ ఆలయ నిర్మాణానికి భూమి పూజ

దిశ, కరీంనగర్ టౌన్ : కరీంనగర్ లో టీటీడీ ఆలయ నిర్మాణంతో నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకోబోతోందని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. నేడు శనివారం కరీంనగర్ పద్మానగర్ లో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించే స్థలాన్ని, భూమి పూజ పనులను టీటీడీ అధికారులు, స్థపతులతో కలసి మంత్రి పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణలో అన్ని కులాలు, అన్ని మతాల వారు సమానంగా గౌరవింపబడుతున్నారని తెలిపారు. కరీంనగర్ లో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని కెసీఆర్ సంకల్పించారని తెలపారు. శ్రీవారి ఆలయాన్ని కరీంనగర్ లో నిర్మించాలని ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, కావేరి భాస్కర రావు, దివకొండ దామోదర్ రావుతో కలిసి సీఎం కేసీఆర్ కు విన్నవించడంతో ప్రత్యేక చొరువతో ఆలయ నిర్మాణానికి టీటీడీ బోర్డు అంగీకరించిందని తెలిపారు.

పద్మనగర్ లో 10 ఎకరాల స్థలంలో రూ.20 కోట్లతో టీటీడీ సహకారంతో అద్భుతంగా ఆలయాన్ని నిర్మిస్తున్నామని వెల్లడించారు. ఆలయ నిర్మాణ పనుల కోసం ఇటీవలే తిరుమల తిరుపతిని సందర్శించి టీటీడీ బోర్డు మీటింగులో ఆలయ నిర్మాణ పత్రాలను, పనుల టెండర్ల ప్రక్రియ గురించి కులంకషంగా చర్చించామని తెలిపారు. 31న టీటీడీ ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేస్తున్నామని, ఆలయ భూమి పూజకు టీటీడీ చైర్మన్ వై.వీ సుబ్బారెడ్డితో పాటు ఏవో ధర్మారెడ్డి, జేఈవోలు, వేద పండితులు హాజరవుతారని వెల్లడించారు.

ఆలయ నిర్మాణ పనులు ఏడాదిన్నరలో పూర్తి అవుతుందన్నారు. కరీంనగర్ ప్రజలంతా భూమిపూజకు హాజరుకావాలన్నారు. అదే రోజు సాయంత్రం శ్రీనివాస కళ్యాణం చేసేందుకు సన్నాహకాలు చేశామని, ఏర్పాట్లు కూడ చురుకుగా సాగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నర్సింహ మూర్తి, డీఈ నాగరాజు, ఏఈ చల్మానాయక్, అసిస్టెంట్ స్థపతి రవికాంత్ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్, గ్రంథాలయ చైర్మన్, పొన్నం అనిల్, పిల్లి మహేష్, సుమన్ రావు, డైరెక్టర్ నేతి రవివర్మ, మిడిదొడ్డి నవీన్, కర్ర సూర్య, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed