సౌలత్‌లే లేవాయే.. మేమేట్లుండాలే..?

by Dishanational1 |
సౌలత్‌లే లేవాయే.. మేమేట్లుండాలే..?
X

దిశ, సిరిసిల్ల: రాష్ట్రమే అబ్బురపడే విధంగా రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో అభివృద్ది కార్యక్రమాలు జరుగుతున్నాయని ఉదరగొడుతున్న నాయకులు, పాలకులకు జిల్లా కేంద్రంలోని రైతుబజార్ లో రైతుల కష్టాలు కనిపించడంలేదా స్థానికులు అంటున్నారు. రైతుబజార్ లో రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. 'జూన్ 2020లో రూ. 5.15కోట్ల అంచన వ్యయంతో మానేరు నది పక్కన ప్రభుత్వం రైతు బజార్ నిర్మించింది. సకల వసతులున్నాయని, గాంధీ చౌక్ వద్ద నున్న కూరగాయల మార్కేట్ ను రైతు బజార్ కు తరలించే ప్రయత్నం చేసిన అధికారుల ప్రయత్నాన్ని చిరువ్యాపారులు సాగనివ్వలేదు.

చేసేది లేక సకల వసతులున్నాయని, గ్రామాల నుండి వచ్చే రైతులను రైతుబజార్ వద్ద కూర్చోబెట్టారు. అంతబాగానే ఉన్నా అక్కడ కూరగాయలు అమ్ముకుంటున్న రైతులకు తాగడానికి నీరు, మల, మూత్రవిసర్జనకి సులభ్ కాంప్లేక్స్ ఏర్పాటు చేసిన అధికారులు,వాటిని వినియోగంలోకీ తెకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత కొన్ని నెలలుగా రైతులు మల, మూత్ర విసర్జనకి వెళ్ళాలంటే మానేరులోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. ఇకనైనా అధికారులు రైతుబజార్ లో ఉన్న సులభ్ కాంప్లేక్స్ ను తెరిపించాలని కోరుతున్నారు.


అవతలికి పోవడానికి అవస్త అయితంది: మహిళ రైతు,మాడుగుల లక్ష్మి, బోనాల

రైతు బజార్ల సల్వతులు లేవు, ఇక్కడ మేం ఎట్లుండాలే?. అవస్త అయితంది. పెద్ద సార్లు ఎందుకు పట్టించుకుంటలేరో తెల్తలేదు. జర నీళ్ళకు, అవుతల్కి పోవడానికి సల్వత్ చేయించడ్రి.



Next Story

Most Viewed