ఉచిత బస్సు కింద పడ్డ అంజన్న భక్తుడు

by Disha Web Desk 12 |
ఉచిత బస్సు కింద పడ్డ అంజన్న భక్తుడు
X

దిశ, మల్యాల: హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి వచ్చిన భక్తుడు ప్రమాదానికి గురయ్యాడు. భక్తుల కోసం దిగువ కొండగట్టు నుండి గుట్ట పైకి ఏర్పాటు చేసిన ఉచిత బస్సు చక్రాల కింద పడడంతో రెండు కాళ్లు నుజ్జునుజ్జు అయ్యాయి. అయితే దేవస్థానం అధికారులు సోమవారం భక్తుల కోసం ఈ ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభించారు. ప్రమాదానికి గురైన భక్తుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పెద్ద మొత్తంలో తరలివస్తున్న భక్తులు బస్సు ఎక్కేటప్పుడు, రోడ్డు దాటేటప్పుడు ప్రమాదాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.



Next Story

Most Viewed