న్యాయం చేయాలని రోడ్డుపై నిరసన.. భారీగా ట్రాఫిక్ జాం

by Dishanational2 |
న్యాయం చేయాలని రోడ్డుపై నిరసన.. భారీగా ట్రాఫిక్ జాం
X

దిశ, జగిత్యాల టౌన్: జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన రైతు జలపతి రెడ్డి ఇటీవల తన ఇద్దరు కూతుర్లతో సహా ఆత్మహత్య చేసుకోగా, మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మృతుడి కుటుంబ సభ్యులు జగిత్యాల కరీంనగర్ నేషనల్ హైవేపై బైఠాయించి ధర్నా చేశారు.

ఈ సందర్భంగా మృతుడు జలపతి రెడ్డి కుమార్తె మాట్లాడుతూ.. మా నాన్న మృతికి కారణమైన అడ్వకేట్ దామోదర్ రావు ను వెంటనే అరెస్టు చేయాలని ఆత్మహత్య చేసుకుని 11 రోజులు అవుతున్నా పోలీసులు అరెస్ట్ చేయడం లేదని ఆరోపిస్తూ, తన తండ్రి చెల్లెళ్ల చావుకు ప్రభుత్వమే బాధ్యత వహించి బాధ్యులను అరెస్టు చేయాలని కోరింది.

ఈ నిరసన కార్యక్రమం తో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సంఘటన వివరాలు తెలుసుకున్న జగిత్యాల డీఎసీపీ రత్నాపురం ప్రకాష్, మృతుడి కూతురుతో ఫోన్లో మాట్లాడి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని న్యాయం జరిగే విధంగా చూస్తామని హామీ ఇవ్వడంతో నిరసన కార్యక్రమాన్ని విరమించారు. అనంతరం తాము కోల్పోయిన భూమిని తమకు ఇప్పించే విధంగా చూడాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed