మహిళలకు తపాలా శాఖ గుడ్ న్యూస్..

by Disha Web Desk 20 |
మహిళలకు తపాలా శాఖ గుడ్ న్యూస్..
X

దిశ, కరీంనగర్ టౌన్ : అన్ని వర్గాల ప్రజలకు వివిధ సేవలను విస్తృతం చేసిన తపాలశాఖ ఇటీవల పలు పథకాలపై భారీగా వడ్డీ రేట్లను పెంచడంతో పాటుగా మహిళలకు కూడా గుడ్ న్యూస్ చెప్పింది. మహిళల ఆర్థిక పరిపుష్టి కోసం ప్రత్యేకంగా 'మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్-2023' పేరిట కొత్త స్కీమ్ ను ప్రవేశపెట్టింది. గత మార్చి 31నుంచి అమలులోకి వచ్చిన ఈ స్కీమ్ ను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్ డివిజనల్ పోస్టల్ ఎస్పీ వై.వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో కోరారు.

ఈ మేరకు గురువారం పోస్టల్ ఎస్పీ ఈ స్కీమ్ వివరాలతో ఒక ప్రకటన విడుదల చేశారు. మహిళా సమ్మాన్ సేవింగ్స్ ఖాతాను మహిళలు ఓపెన్ చేసుకోవచ్చునని, వారి సంరక్షణలో మైనర్ బాలికలకు కూడా ఓపెన్ చేసుకోవచ్చునని తెలియజేసారు. ఈ స్కీంలో రూ.1,000 నుండి 2 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చని, ఈ డిపాజిట్లపై 7.5 శాతం వడ్డీ వస్తుందని వివరించారు. మరింత సమాచారం కోసం మీ దగ్గరలోని పోస్టాఫీసులలో సంప్రదించాలని సూచించారు. అలాగే అన్ని వర్గాల ప్రజలకు పోస్టల్ పథకాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని పోస్టల్ ఎస్పీ ప్రజలను కోరారు.



Next Story

Most Viewed