ఎండ వేడితో నడిరోడ్డుపై ఆమ్లెట్..

by Disha Web Desk 1 |
ఎండ వేడితో నడిరోడ్డుపై ఆమ్లెట్..
X

దిశ, గోదావరి ఖని : అబ్బా ఎండలు మండిపోతున్నాయి. నేలపై అడుగుపెడితేనే కాలిపోతోంది. ఈ వేడికి ఆమ్లెట్ వేసుకోవచ్చు అని ఎండల తీవ్రతను చెబుతూ మాట్లాడుకుంటారు. పెద్దపల్లి జిల్లాలో నిజంగానే ఎండ వేడిలో నడిరోడ్డపై ఆమ్లెట్ వేశారు. తెలుగు ప్రజలు ఎండల తీవ్రతకు నరకయాతన అనుభవిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఎండ వేడితో ఆమ్లెట్ అవుతుందా లేదా అనే కుతూహలంతో గోదావరి ఖని వాసులు ప్రయత్నించారు. పట్టణంలోని చౌరస్తాలో రోడ్డు పై బంగారు కనకరాజు అనే సింగరేణి కార్మికుడు కోడి గుడ్డు పగలగొట్టి రోడ్డపై వేయగా అది కాస్తా.. ఆమ్లెట్ గా మారింది. ఓ వైపు ఎండ తీవ్రతకు జనం విలవిలలాడుతున్నా ఈ చిత్రాన్ని పట్టణ వాసులు ఆసక్తిగా తిలకించారు.



Next Story