సెస్ అధికారుల నిర్లక్ష్యం.. రైతు కనెక్షన్‌ను మరొకరికి మార్చిన వైనం

by Disha Web Desk 23 |
సెస్ అధికారుల నిర్లక్ష్యం.. రైతు కనెక్షన్‌ను మరొకరికి మార్చిన వైనం
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : సిరిసిల్లలో సెస్ అధికారుల నిర్లక్ష్యం రోజు రోజుకి మితిమీరిపోతుంది. రైతుకు తెలియకుండానే తన వ్యవసాయ బావి కనెక్షన్లు మరొకరి పేరు మీదకి సెస్ అధికారులు మార్చిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని తంగళ్లపల్లి మండలం గోపాల్ రావు పల్లె గ్రామానికి చెందిన ఎడ్ల నర్సయ్య ఆగ్రామ శివారులో మూడు ఎకరాల భూమి ఉందగా, అదే వ్యవసాయ భూమిలో ఒక వ్యవసాయ బావి ఉంది. దానికి 1985 నుండి సిరిసిల్ల సెస్ లో ఆ బావికి కనెక్షన్ ఉంది. గత కొంత కాలం వరకు ఆ కనెక్షన్ ఎడ్ల నర్సయ్య పేరుమీదనే ఉంది. తన వ్యవసాయ బావి మోటారుకు సంబంధించిన కనక్షన్ పాపయపెల్లె గ్రామానికి చెందిన ఓ వ్యక్తి దొంగ తనంగా తన పేరుపై చేయించుకున్నట్లు తెలుసుకున్న రైతు నర్సయ్య తంగళ్లపల్లి మండల సెస్ కార్యాలయంలో తెలిపాడు.

తంగళ్ళపల్లి మండల సెస్ కార్యాలయం చుట్టూ రెండు నెలలు తిరిగి అలిసిపోయి, జిల్లా కేంద్రంలోని సెస్ కార్యాలయంలో కూడా పిర్యాదు చేశాడు. వాళ్ళు పట్టించుకోక పోవడంతో ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడు. నర్సయ్య సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ జిల్లా కలెక్టర్ సెస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్ ఆదేశాలను కూడా సెస్ అధికారులు బేఖాతరు చేశారు. పొరపాటు జరిగిందని తమే సరిదిద్దుతామని చెప్పి, 6 నెలలు దాటినా సెస్ అధికారుల పట్టించుకున్న పాపాన పోవడం లేదని రైతు నర్సయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పుడు పాత బకాయిలు కట్టమని వేధిస్తున్నారని కన్నీరు మున్నీరు అయ్యాడు. ఇప్పటికైనా సెస్ ఉన్నతాధికారులు స్పందించి తన బావి కనెక్షన్ తనకు ఇప్పించి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన సదరు అధికారులపై చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నాడు.

Next Story