ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలి: కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి జువ్వాడి నర్సింగ్ రావు

by Disha Web Desk 1 |
ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలి: కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి జువ్వాడి నర్సింగ్ రావు
X

దిశ, మెట్ పల్లి: ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని కోరుతూ కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి జువ్వాడి నర్సింగ్ రావు, సీనియర్ నాయకుడు జువ్వాడి కృష్ణ రావు ఆధ్వర్యంలో వెంపేట గ్రామం నుంచి ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా జువ్వాడి నర్సింగ్ రావు మాట్లాడుతూ గతంలో ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన సీఎం కూతురు కల్వకుంట్ల కవిత మరియు ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని మాయ మాటలు చెప్పి ఇప్పటి వరకు తెరిపించలేద ఆరోపించారు.

గత పార్లమెంట్ ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత కి నిజామాబాద్ పార్లమెంట్ రైతులు, ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. సీఎం కేసీఆర్ మూసివేసిన షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడానికి డబ్బుల్లేవు.. కానీ విశాఖ ఫ్యాక్టరీలో వాటా కొనడానికి మాత్రం డబ్బు ఎక్కదంటూ నిలదీశారు. నిజంగా సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో మీరు మూసి వేసిన షుగర్ ఫ్యాక్టరీలను మొత్తం తెరిపించి.. అనంతరం ఇతర ఫ్యాక్టరీల గురించి ఆలోచించాలని హితవు పలికారు.

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేగా గెలిచాక షుగర్ ఫ్యాక్టరీ తెరిపించకపోతే అదే షుగర్ ఫ్యాక్టరీ ఉరివేసుకుంటానన్న ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మాట మీద నిలబడతలన్నారు. రాబోవు రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి రైతులు, ప్రజలు తగిన బుద్ధి చెబుతారని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే షుగర్ ఫ్యాక్టరీ తెరిపించి ఈ ప్రాంత రైతులకు న్యాయం చేస్తామని కోరారు.

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లూరి మహేందర్ రెడ్డి, వేంపేట ఉప సర్పంచ్ గోరు మంతుల ప్రవీణ్ కుమార్, అల్లూరి సురేందర్ రెడ్డి, వేంపేట గ్రామ శాఖ అధ్యక్షుడు రాజారెడ్డి, లింగారెడ్డి, బద్దం స్వామి, రైతు అధ్యక్షుడు మామిడి నారాయణరెడ్డి, మాజీ జడ్పీటీసీ జలపతి రెడ్డి, కొంతం రాజం, ఎంపీటీసీలు మామిడి మంజుల లక్ష్మారెడ్డి, మల్లయ్య,సీడీసీ మాజీ చైర్మన్ కంది బుచ్చి రెడ్డి, రాజేందర్ రెడ్డి,

కోరుట్ల పట్టణ అధ్యక్షుడు తిరుమల గంగాధర్, పెరుమాండ్ల సత్యనారాయణ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, కిషన్ సెల్ కార్యదర్శి క్రాంతి కుమార్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొమిరెడ్డి లింగారెడ్డి, బీ. శ్రీనివాస్, అందే మారుతి, యూత్ కాంగ్రెస్ నాయకులు జెట్టి లక్ష్మణ్, మామిడి మహేష్, నల్ల శేఖర్, ఎలేటి మహేష్, బాపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రైతులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed