జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కు పితృ వియోగం

by Disha Web Desk 23 |
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కు పితృ వియోగం
X

దిశ,జగిత్యాల టౌన్ : జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తండ్రి హనుమంతరావు(89) శుక్రవారం అనారోగ్యం కారణంగా మృతి చెందారు. సీనియర్ న్యాయవాది హనుమంత రావు మృతి పట్ల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హనుమంత రావు తో తనకున్న అనుబంధాన్ని జీవన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్సీ తో పాటు రాజకీయ ప్రముఖులు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు సంతాపం తెలియజేశారు. కాగా హనుమంతరావు అంత్యక్రియలు శుక్రవారం రాత్రి 8 గంటలకు మోతే రోడ్డులో గల స్మశాన వాటికలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు.


Next Story

Most Viewed