బీజేపీలో లుకలుకలు.. రాజీనామా బాటలో మండల బీజేపీ అధ్యక్షుడు

by Disha Web Desk 23 |
బీజేపీలో లుకలుకలు..  రాజీనామా బాటలో మండల బీజేపీ అధ్యక్షుడు
X

దిశ, వెల్గటూర్ : భారతీయ జనతా పార్టీలో లుకలుకలు మొదలైనవి. సోమవారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పార్టీ పరిశీలకులు శ్రీరామ్ షిండే బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి సాక్షిగా జిల్లా, మండల బీజేపీ పార్టీ నాయకుల మధ్య ఉన్న విభేదాలు బహిర్గతం అయ్యాయి. జిల్లా అసెంబ్లీ నాయకుల ఒంటెద్దు పోకడలను కొందరు సీనియర్ కార్యకర్తలు వేదికపైనే విమర్శించడం సంచలనం రేపింది. పార్టీ నాయకుల మధ్య విభేదాలు కొంతకాలంగా కొనసాగుతున్న బహిర్గతం కాలేదు. బీజేపీ పార్టీ నాయకుల మధ్య నెలకొన్న విభేదాలు తార స్థాయికి చేరుకొని మండల అధ్యక్షుడు చక్రపాణి రాజీనామాకు దారి తీయడం విశేషం. ఈ క్రమంలోనే ముఖ్య కార్యకర్తల సమావేశం అనంతరం ఉమ్మడి వెల్గటూర్ మండల బీజేపీ అధ్యక్షుడు తంగళ్ల పల్లి చక్రపాణి బీజేపీ పార్టీకి వచ్చే బుధవారం రాజీనామా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీ పార్టీ అసెంబ్లీ జిల్లా నాయకత్వ ఒంటెద్దు పోకడకు నిరసనగా తాను బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు.

ఎండపల్లి మండల కేంద్రంలోని ఎస్సార్ గార్డెన్ లో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ధర్మపురిలో బీజేపీపార్టీ పరిస్థితి దిగజారి పోతుందని కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ కార్యక్రమాల గురించి సరైన సమాచారం ప్రజా ప్రతినిధులు లైన సర్పంచులు ఎంపీటీసీలు ఇతరత్రా కార్యకర్తలకు అందడం లేదని బీజేపీ సీనియర్ నాయకులు జాడి రాజేశం వేదికపైనే తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. పార్టీ కార్యక్రమాల గురించి తనకే సరైన సమాచారం ఇవ్వడం లేదని ఇక సాధారణ కార్యకర్తల సంగతి మరింత అధ్వాన్నం గా ఉందని, ఆపదలో ఉన్న కార్యకర్తలను ఆదుకునే వారే లేరని , ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించే కార్యకర్తలపై పోలీసుల ఒత్తిడిలు కేసులు పెరుగుతున్న తమకు వెన్నుదన్నుగా ఉండి ప్రశ్నించే నాయకులు లేకపోవడం తో కార్యకర్తలు భయం భయంగా జీవనం సాగిస్తు న్నారని చక్రపాణి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తాను రాజీనామా బాట పడుతున్నట్టు మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు చక్రపాణి తెలిపారు . తనతో పాటు మరో రెండు మండలాల అధ్యక్షులు ఇతర పార్టీల్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

రెండు రోజుల్లో మరింత మంది కీలకమైన కార్యకర్తలతో కలిసి నిర్ణయం తీసుకొని తమకు సముచిత స్థానాన్ని కల్పించే పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే ధర్మపురి లో బిజెపి జెండా ఎగరాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. అందుకు కావాల్సిన సహాయ సహకారాలన్నీ తాను అందిస్తానని ప్రకటించారు. ధర్మపురిలో బిజెపి నుంచి పోటీ చేసే క్యాండిడేట్ ను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు. కార్యకర్తలం తా సమన్వయంతో ఉంటూ, మోడీ పథకాలన్నిటికీ క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు తీసుకెళ్లి ఓటర్లను అభ్యర్థించి బీజేపీ అభ్యర్థిని గెలిపించు కోవాలని పిలుపునిచ్చారు. పార్టీ అన్నప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. ఎన్నికల వేళ అందరూ సమన్వయంతో పని చేసి తమ అభ్యర్థిని గెలిపించుకోవాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు శ్రీరామ్ షిండే, జిల్లా అధ్యక్షులు మోర పల్లి సత్యనారాయణ ఉపాధ్యక్షులు గాజుల మల్లేశం అసెంబ్లీ కన్వీనర్ కస్తూరి సత్యం, కాడే సూర్యనారాయణ,మండల అధ్యక్షుడు తంగళ్ళపల్లి చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.


Next Story