బీజేపీని ఓడిద్దాం.. రాజ్యాంగాన్ని కాపాడుకుందాం

by Disha Web Desk 15 |
బీజేపీని ఓడిద్దాం.. రాజ్యాంగాన్ని కాపాడుకుందాం
X

దిశ, కాప్రా : పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించి ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకుందామని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు పిలుపునిచ్చారు. సీపీఎం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఈసీఐఎల్ చౌరస్తాలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దేశ ప్రజానికాన్ని, కార్మికవర్గాన్ని బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందని, ఎన్నికల వేళ వికసిత్ భారత్, సుస్థిర అభివృద్ధి, రామరాజ్య స్థాపన వంటి మాటలు చెప్పి మూడోసారి అధికారాన్ని దక్కించుకోవడం కోసం జిమ్మిక్కులు చేస్తోందన్నారు. తెలంగాణలో భువనగిరిలో మాత్రమే సీపీఎం పోటీ చేస్తుందని, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తామని, భువనగిరిలో మాత్రం తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీని కోరినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పైన ఇష్టంతో కాదని, బీజేపీని ఓడించాలని తెలిపారు. కార్మిక చట్టాలు రద్దుచేసి బడా పెట్టుబడిదారులకు అండగా నిలిచాడని, కార్మికుల హక్కుల్ని తొలగించారని తెలిపారు.

తమకు అనుకూలంగా ఉండాలని పెట్టుబడిదారులు మోడీతో ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. మోడీ మళ్లీ అధికారంలోకి వస్తే రైతుల మూడు వ్యతిరేక చట్టాలను తీసుకొస్తాడని, కార్మికులకు నష్టం కలిగించే చట్టాలు తెచ్చి బడా పెట్టుబడిదారులకు ఉపయోగపడే విధంగా చూస్తాడని తెలిపారు. కావున పార్లమెంట్ ఎన్నికల్లో మోడీని ఓడించడమే మన లక్ష్యమన్నారు. ఢిల్లీలో రైతులు పోరాటాలు చేస్తే కార్పొరేట్ మీడియా, న్యూస్ పేపర్స్ లో ఎవరూ ప్రచురించలేదన్నారు. దానిని మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులు యూట్యూబ్ ఛానల్ లో చూపించినందుకు తీసుకెళ్లి జైలులో పెట్టారని తెలిపారు. కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పై కేసు ఉన్నందున వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ దేశంలో కార్మికులకు కనీస వేతన చట్టం లేకుండా, కనీస వేతనం ఇవ్వడం లేదన్నారు. బీజేపీని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పి.సత్యం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డీజీ నరసింహారావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జె.చంద్రశేఖర్, ఎర్ర అశోక్, చింతల యాదయ్య, వినోద, మేడ్చల్ జిల్లా కమిటీ సభ్యులు రాథోడ్ సంతోష్, జి. శ్రీనివాసులు, ఎన్. శ్రీనివాసులు, రాజశేఖర్, లక్ష్మణ్, సబితా, సృజన, ఎర్రం శ్రీనివాస్ పాల్గొన్నారు.



Next Story

Most Viewed