ఆర్థిక స్థోమత లేని పేద విద్యార్థికి ఫీజులు చెల్లించి మేనమామనవుతా..

by Dishanational1 |
ఆర్థిక స్థోమత లేని పేద విద్యార్థికి ఫీజులు చెల్లించి మేనమామనవుతా..
X

దిశ, మంథని: మంథని నియోజకవర్గంలోని ఆర్థిక స్తోమత లేని పేద విద్యార్థులకు రెండు దఫాలుగా ఫీజులు చెల్లించి వారి కుటుంబ సభ్యులలో ఒకరిగా మేనమామలా అండగా నిలుస్తానని పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ పేర్కొన్నారు. శనివారం మంథని మండలం మల్లెపల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కళాశాల క్రీడా వార్షికోత్సవ వేడుకలో ఆయన పాల్గొని మంథని మున్సిపల్ ఛైర్ పర్సన్ పుట్ట శైలజతో కలిసి విద్యార్ధులకు బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా జడ్పీ ఛైర్మన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ డిగ్రీ కళాశాల బలోపేతానికి, విద్యార్ధులకు అన్ని సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామన్నారు. డిగ్రీ కళాశాల మంథని కేంద్రానికి దూరంగా ఉండటంతో ఎంతో విద్యార్ధులకు దూరబారం అవుతోందని, ఆర్థికబారం కూడా అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కళాశాలల్లో చదువుకునే పేద విద్యార్ధులకు తమవంతుగా సాయం అందించాలని తాము ఆలోచనలు చేస్తున్నామన్నారు. సింగరేణి, సీఎస్సార్‌ నిధులు, ఎన్టీపీసీ, మున్సిపాలిటీ, మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ల ద్వారా ఏమైనా నిధులు సేకరించి వసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఎంతో మంది డిగ్రీ వరకు చదువుకోవాలనే తపనతో ఎవరైతే వస్తున్నారో అలాంటి విద్యార్ధులకు అండగా నిలుస్తామన్నారు. ఏ ఉద్యోగం సాధించాలన్నా డిగ్రీ అవసరమని వివరించారు.

పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం గొప్పగా ఆలోచన చేసి కళాశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ మెరుగైన విద్యను అందిస్తోందన్నారు. ఆర్థిక స్థోమత లేక ఫీజులు కట్టలేని విద్యార్ధులకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు తమ వంతు సాయంగా మల్లెపల్లి గ్రామసర్పంచ్‌ ఎరుకల తిరుపతమ్మ రవిలు రూ. 5 వేలు సాయం చేయడం ఇందుకు నిదర్శనమని అన్నారు. ప్రతి విద్యార్థి మంచి ఉద్యోగాలు సాధించి గౌరవంగా బతకాలి అన్నారు. అనంతరం విద్యార్దులకు జ్ఞాపికలు అందజేశారు. అలాగే జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌కు కళాశాల ప్రిన్సిపాల్‌ తాహెర్‌ హుస్సేన్‌ మెమోంటో అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొండ శంకర్, జడ్పీటీసీ సుమలత, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed