వైభవంగా పార్వతీ కోటేశ్వర స్వామి కళ్యాణోత్సవం

by Disha Web Desk 1 |
వైభవంగా పార్వతీ కోటేశ్వర స్వామి కళ్యాణోత్సవం
X

పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి కొప్పుల ఈశ్వర్

దిశ, వెల్గటూర్: మండల పరిధిలోని కోటిలింగాలలోని కోటేశ్వర స్వామి ఆలయంలో పార్వతీ కోటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఈవో కాంత రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో అందంగా అలంకరించిన వేదికపై గంగా గౌరీ సమేతుడైన శ్రీ కోటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను ఉంచి వేద పండితులు కళ్యాణ క్రతువును వైభవంగా నిర్వహించారు.

ఆది దంపతులైన శివపార్వతుల కళ్యాణంలోని వధూవరుల పరిచయ కార్యక్రమం మొదలుకొని బంధువుల రాకపోకలు పట్టు వస్త్రాల ధారణ యజ్ఞోపవీతము, బాసింగాల ధరింపు జీలకర్ర బెల్లం ప్రాముఖ్యత మాంగళ్య ధారణ తలంబ్రాలు లాంటి కళ్యాణ ఘట్టాలను వేద పండితులు భక్తులకు కళ్లకు కట్టినట్టుగా నిర్వహించారు. అంతకు ముందు స్వామి వారి కల్యాణానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ తలంబ్రాలు, పట్టు వస్త్రాలు, మెట్టెలు మంగళసూత్రంలను సమర్పించారు. అనంతరం ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కల్యాణనికి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. నూతన వధూవరులైన శివ, పార్వతులకు కళ్యాణం అనంతరం మహిళా భక్తులు ఓడి బియ్యంను సమర్పించారు. కళ్యాణోత్సవాన్ని తిలికించడానికి వచ్చిన భక్తులకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొనుగోటి శ్రీనివాసరావు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఈవో కాంతారెడ్డి, ఎంపీపీ లక్ష్మీ, జడ్పీటీసీ సుధారాణి, పదిర నారాయణ రావు, రా రైస్ మిల్స్ సంఘం జిల్లా అధ్యక్షులు నూనె శ్రీనివాస్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రేగొండ రామన్న సంజీవ్ సుధాకర్ రావు, అర్చకులు నాగరాజు, గాజుల సతీష్, తదితరులు పాల్గొన్నారు



Next Story

Most Viewed