పరిపాలనా సౌలభ్యం కొరకే చిన్న మండలాల ఏర్పాటు : మంత్రి కొప్పుల ఈశ్వర్

by Disha Web Desk 1 |
పరిపాలనా సౌలభ్యం కొరకే చిన్న మండలాల ఏర్పాటు : మంత్రి కొప్పుల ఈశ్వర్
X

దిశ, వెల్గటూర్: పరిపాలనా సౌలభ్యం కొరకే చిన్న మండలాల ఏర్పాటు చేసి ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేశామని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం ఎండపల్లి మండల కేంద్రంలో రూ.కోటి నిధులతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు మంత్రి కొప్పుల ఈశ్వర్ శిలాఫలకాన్ని ఆవిష్కరించి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎండపల్లి మండల కేంద్రంలో జగిత్యాల వెళ్లే క్రాస్ రోడ్డు నుంచి కరీంనగర్ క్రాస్ రోడ్డు వరకు రూ.1కోటి నిధులతో ఏర్పాటు చేయబోయే హైమాస్ట్ లైట్స్ అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించారు. అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. పరిపాలనా సౌలభ్యం కొరకే చిన్న మండలాల ఏర్పాటు చేసి ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేశామన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన మండలాల్లో వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేకంగాశ్రద్ధ తీసుకొని నిధులు కేటాయించిందన్నారు.

ఇందులో భాగంగానే రూ.కోటి విలువ గల హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. గత ప్రభుత్వాల మాదిరిగా అభివృద్ధి చేస్తామని చెప్పడం కాదు.. పనులు కూడా చేసి చూపెట్టడమే బీఆర్ఎస్ ప్రభుత్వ విధానమన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించే ప్రభుత్వాన్ని ఎల్లప్పుడూ ఆదరించి అక్కున చేర్చుకోవాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.



Next Story

Most Viewed