కొనుగోలు జాప్యంతో రోడ్డెక్కిన అన్నదాతలు

by Disha Web Desk 23 |
కొనుగోలు జాప్యంతో రోడ్డెక్కిన అన్నదాతలు
X

దిశ,కోనరావుపేట : ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను విక్రయించడానికి రైతన్నలు నానా తంటాలు పడుతున్నారు. విత్తనాలు నాటింది మొదలు ఎరువులు, క్రిమి సంహారక మందులు కోసం పడిగాపులు గాస్తున్న రైతన్నలు చివరికి పంట విక్రయించడానికి నానా అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తుంది.ప్రభుత్వాలు మారినా ,నాయకులు మారిన అన్నదాత కష్టాలు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది పరిస్థితి. అధికారులు నాయకులు ఎన్ని ప్రగడ బాల్ పలికిన రైతులకు ఒరిగింది ఏమి లేకపోవడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. కోనరావుపేట మండల కేంద్రంలోని బావుసాయిపేట, గోవిందరావుపేట, వట్టి మల్ల,మారిమడ్ల,బుక్యారెడ్డి తండా కొనుగోలు కేంద్రాల్లో జాప్యంతో ,లారీలు రాక రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నాయకులు ,అధికారులు ధాన్యం కేంద్రాలను హట్టహాసంగా ప్రారంభించినప్పటికి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లకు తరలించడంలో పూర్తిస్థాయిలో విఫలమవడంతో మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాల్లో కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన ధాన్యం రాశులు దర్శనమిస్తున్నాయి. కోనరావుపేట సింగిల్ విండో ఆధ్వర్యంలో ప్రారంభించిన కొనుగోలు కేంద్రాల్లో లారీలు సమయానికి రాకపోవడం దాదాపు 3000 నుంచి 4000 వరకు ధాన్యం బస్తాలు నిలువ ఉండటం తో రైతన్నలు బిక్కు బిక్కుమంటూ ఎప్పుడు వర్షాలు వస్థాయో అని భయాందోళన గురవుతున్నారు. ఈ అకాల వర్ష ప్రభావాలకు ధాన్యం తడుస్తుందటంతో ఎటు దిక్కు తోచని స్థితిలో రైతన్న పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

రైతులను నిలువు దోపిడీ చేస్తున్న మిల్లర్లు, ఐకేపీల నిర్వాహకులు..

రైతును రాజుగా చేయడం మన లక్ష్యం అని పదే పదే పాలకులు ఉదరగొడుతున్న క్షేత్ర స్థాయిలో మాత్రం ఆ పరిస్థితి కన్పించడం లేదు. ఎవరో ఒకరి చేతిలో మోసపోతూనే ఉన్నాడు.ప్రభుత్వ కొనుగోలు సెంటర్లు,ఐకేపీ సెంటర్లు సైతం ధాన్యం విక్రయాల్లో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.నిబంధనలకు విరుద్ధంగా తాలు,పొల్లు సాకుతో క్వింటాల్ కి 3 నుండి 4 కిలోల తరుగు పేరిట కటవుతాయి అని అనడంతో చేసేది ఏమీ లేక రైతులు లబోదిబోమంటున్నారు.40 కిలోల 600 గ్రాముల తూకం వేయాలని ప్రభుత్వ అధికారులు అదేశినప్పటికి మండల కేంద్రంలోని కొన్ని గ్రామాల్లో 42 నుండి 43 కిలోల వరకు తూకం వేస్తూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇదేమి అని రైతులు ప్రశ్నిస్తే 43 కిలోలు ఐతేనే మిల్లర్లు ధాన్యం లోడును దిగుమతి చేసుకుంటారంట అని ఐకేపీ నిర్వాహకులు అంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.ఎప్పటికైనా అధికారులు స్పందించి రైస్ మిల్లర్ల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.

రోడ్డెక్కిన అన్నదాతలు..

రైతన్నను అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్న అధికారులు మాత్రం చొరవ తీసుకోవడం లేదు.ఎండ ,వాన అనక కష్టపడి పండించిన పంట కండ్ల ముందే నష్టపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో బావుసాయిపేట గ్రామం గోవిందరావుపేట తండా రైతన్నలు వడ్ల బస్థాలతో బుధవారం రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు.కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు లారీల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.గోవిందరావుపేట తండా ఐకేపీ సెంటర్ లో దాదాపు 3000 ధాన్యం బస్తాలు కుప్పలుగా ఉన్నాయి అని,లారీలు రాకపోవడంతో ఆ ధాన్యం కాస్త బరువు తగ్గి దిగుబడిలో నష్టం వస్తుంది అని ,మరోవైపు ఈ అకాల వర్షాలకు వడ్లు తడిసి మొలకలు వస్తున్నాయి, ఈ ఐకేపీ సెంటర్లో ఇంత జరుగుతున్నా మ బాధలు ఎవరు పట్టించుకోవడం లేదని గొడువెళ్ళబోసుకున్నారు.ఎప్పటికైనా అధికారులు స్పందించి లారీల కొరతకు మరియు మిల్లర్ల అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని అన్నారు.



Next Story

Most Viewed