సాగునీటికై రోడ్డు ఎక్కనున్న రైతులు.. ?

by Disha Web Desk 23 |
సాగునీటికై రోడ్డు ఎక్కనున్న రైతులు.. ?
X

దిశ,రామడుగు : పంట పొలాలకు సాగునీరు లేక రైతాంగం అరిగొసలు పడుతున్నారు. పంట పొలాల్లోకి ఏకంగా ట్యాంకర్లను మాట్లాడుకొని పొలాలకు నీటిని తరలిస్తున్న దృశ్యాలు రామడుగు మండలంలో చోటు చేసుకుంటున్నాయి. రామడుగు మండలం లో పెద్ద చెరువు అయినా గండి చెరువులో నీరు అడుగంటి పోవడంతో చెరువు పై ఆధారపడి వ్యవసాయం సాగిస్తున్న రైతులు అరిగోస పడుతున్నారు.దీనిపై ప్రజా ప్రతినిధులు స్వయంగా ఎమ్మెల్యేలు కలిసిన స్పందన కరువైందని గ్రామాల్లో రైతులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.ఒక్క గుండి చెరువును నింపితే దాదాపుగా 200 ఎకరాలకు పైచిలుకు గానే పంటలకు నీరు అందే అవకాశం ఉందని రైతులు తెలుపుతున్నారు.

గతంలో ఎన్నడూ కూడా ఇటువంటి పరిస్థితి రాలేదని తేటతెల్లం చేస్తున్నారు. అంతేకాకుండా చెరువులో నీరు పూర్తిగా అడుగంటి పోవడంతో చెరువును ఆనుకొని ఉన్న గ్రామాల్లో ఉన్న వ్యవసాయ, మంచినీటి బావులలో నీటి మట్టం రోజురోజుకు తగ్గుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం ప్రతి ఎకరాకు నీటిని తప్పకుండా అందిస్తామని క్షేత్రస్థాయిలో చెప్పినప్పటికీ కూడా సంబంధిత అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా ప్రధాన చేరువైన గుండి చెరువు నీటి మట్టం తగ్గుతూ వస్తున్న చూస్తున్నారే తప్ప పై అధికారులకు నివేదిక అందించడంలో విఫలమయ్యారని గుండి చెరువును చూస్తే కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తుంది.

రోజు రోజుకు చెరువులో నీరు అడుగంటి పోవడంతో ఇట్టి విషయంపై పలు గ్రామాల రైతులు స్థానిక ఎమ్మెల్యేకు తెలిపిన ప్రయోజనం లేకపోవడంతో ఒక్కొక్కరిగా ఏకమై పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడుతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం.ఇప్పటికైనా రైతాంగం నుంచి వ్యతిరేకత రాకముందే స్థానిక ఎమ్మెల్యే స్పందించి చెరువును నింపాలని రైతులు కోరుతున్నారు.ఇప్పుడున్న సందర్భంలో సాగునీటికై రైతాంగం రోడ్డు ఎక్కితే దీని ప్రభావం ఎంపీ ఎలక్షన్ లో పై ప్రభావం పడే అవకాశం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.


Next Story