షీ టీమ్ సేవలు ఉపయోగించుకోవాలి..

by Disha Web Desk 13 |
షీ టీమ్ సేవలు ఉపయోగించుకోవాలి..
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో ఈ రోజు సిరిసిల్ల పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థినీలకు షీ టీమ్ ఉపయోగాలు, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం షీ టీమ్ ఏఎస్ఐ ప్రేమ్ దీప్ మాట్లాడుతూ.. నేటి కాలంలో బాలికలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, ఒంటరిగా ప్రయాణిస్తున్న సమయంలో ఏదైనా సమస్యను మౌనంగా భరించ కుండా ముందుకు వచ్చి షీ టీమ్‌ని సంప్రదించాలని సూచించారు.


ప్రత్యేకంగా చిన్న పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్‌ టచ్ మీద అవగాహన కల్పించాలని అవసరమైన ఆత్మ రక్షణ విద్యలను నేర్పాలని ఉపాద్యాయులకు వివరించారు. మహిళలు, విద్యార్థినులు ఆపద సమయంలో డయల్ 100, జిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425 లేదా షీ టీమ్ ఎస్ఐ నెంబర్ 8712656424కు ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఎలాంటి వేధింపులకు గురైన అమ్మాయిలు మౌనంగా భరించవద్దని, ధైర్యంగా ముందుకు వచ్చి షీ టీం ని సంప్రదించాలని కోరారు.


విద్యార్థులు, యువతీ, యువకులు సైబర్ క్రైమ్ బారిన పడకుండా.. అందరికి సైబర్ క్రైమ్‌పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మీరు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్లుగా గుర్తిస్తే తక్షణమే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం అందిస్తే వీలైనంత వరకు మీ డబ్బులు మీకు వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, షీ టీం సిబ్బంది విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed