పది ప్రశ్నాపత్రం లీకేజీలో బీజేపీ హస్తం

by Disha Web Desk 1 |
పది ప్రశ్నాపత్రం లీకేజీలో బీజేపీ హస్తం
X

బండి సంజయ్, పీఎం మోదీ దిష్టిబొమ్మలను దగ్ధం చేసిన బీఆర్ఎస్ నాయకులు

దిశ, గొల్లపల్లి: టీ.ఎస్.పీ.ఎస్.సీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో ఉన్న వ్యక్తికి బీజేపీ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, తాజాగా పది ప్రశ్నాపత్రం లీకేజీలో బీజేపీకి హస్తం ఉందని ప్యాక్స్ చైర్మన్ సుంకిసాని రాజసుమన్ రావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలో పదో తరగతి పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రధాన పాత్ర పోషించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ప్రధాని మోదీ దిష్టిబొమ్మను బీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు పడాల జలంధర్ ఆధ్వర్యంలో దగ్ధం చేశారు.

ఈ సందర్భంగా ప్యాక్స్ చైర్మన్ సుంకిసాని రాజసుమన్ రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడానికి బీజేపీ అగ్ర నాయకత్వం చేసిన కుట్రలో భాగమే ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహామని ఆయన అన్నారు. పథకం ప్రకారమే పేపర్ బయటకు వచ్చిందని, విద్యార్థుల జీవితాలతో బీజేపీ పార్టీ నాయకులు చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. తాజాగా పదో తరగతి పేపర్ లీక్ చేసిన వ్యక్తి బండి సంజయ్ కి వాట్సాప్ చేసినట్లు ఆరోపణలు రావడం, ఆ విషయాన్ని దాచడం నిజం కాదా అని ప్రశ్నించారు.

ఈ విషయంలో బీజేపీ తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. బండి సంజయ్ ఆటలు ఇక సాగవని, పరీక్షలు సక్రమంగా నిర్వహణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పదో తరగతి పరీక్షా పత్రం లీకేజీ కేసుల వెనక ఉన్న పెద్దవాళ్లను ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ నక్క శంకర్, జడ్పీటీసీ గోస్కుల జలంధర్, ఏయంసీ చైర్మన్ కంపెళ్లి హనుమాండ్లు, చందోలి ప్యాక్స్ చైర్మన్ గండ్ర మాధవరావు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొల్లెం రమేష్, బీఆర్ఎస్ మండల నాయకులు బలభక్తుల కిషన్ , మరేంపెళ్లి బాబు, చెవుల రవీందర్, ముస్కు లింగారెడ్డి, కిష్టంపేట రామచందర్ రెడ్డి, కూన రాజేందర్, మాడేటి తిరుపతి, మ్యాదరి రమేష్, అశోక్ రావు, వెంకటేష్, వీరస్వాము, శ్రీనివాస్ వినోద్, చందు, మహిపాల్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed