జ్యోతిరావు పూలే కి భారతరత్న ప్రకటించాలి: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

by Disha Web Desk 1 |
జ్యోతిరావు పూలే కి భారతరత్న ప్రకటించాలి: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
X

దిశ, జగిత్యాల ప్రతినిధి: బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడు, సమసమాజ స్థాపన విద్యతోనే సాధ్యమని విద్య వ్యాప్తికి కృషి చేసిన గొప్ప దార్శనికుడు మహాత్మ జ్యోతి రావు పూలేకి కేంద్ర ప్రభుత్వం భారత రత్న ప్రకటించాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు. స్థానిక ఇందిరా భవన్ లో జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం వారు మాట్లాడుతూ విద్యతోనే సమసమాజ స్థాపన జరుగుతుందని భావించి తన భార్యను ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దిన ఘనుడు జ్యోతిబా పూలె అని అన్నారు. ఎందరో మహిళలు విద్య అభ్యసించేలా కృషి చేసిన మహనీయుడు పేరు మీద ప్రభుత్వం పాఠశాలలు ఏర్పాటు చేసింది కానీ అందులో సౌకర్యాలు కల్పించడం మరిచిందన్నారు. బలహీన వర్గాలకు, దళితులకు, అల్ప సంఖ్యాక ప్రజల అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేసినపుడే పూలే కి నిజమైన నివాళి అర్పించినట్లు అని పేర్కొన్నారు.

బడుగు బలహీనర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతి రావు పూలే, సావిత్రి బాయి పూలే లకు భారత రత్న ప్రకటించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పీసీసీ సభ్యులు గిరి నాగభూషణం, కొత్త మోహన్, బండ శంకర్, పులి రాము, కల్లెపల్లి దుర్గయ్య, నక్క జీవన్, పుప్పాల అశోక్, గుంటి జగదీశ్వర్, శ్రీనివాస రెడ్డి, గుండా మధు, చాంద్ పాషా, నేహల్, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed