అలాంటి వాళ్లను నమ్మి ఫ్యాన్స్ మోసపోవద్దు.. స్టార్ హీరోలపై నిర్మాత సంచలన కామెంట్స్

by sudharani |
అలాంటి వాళ్లను నమ్మి ఫ్యాన్స్ మోసపోవద్దు.. స్టార్ హీరోలపై నిర్మాత సంచలన కామెంట్స్
X

దిశ, సినిమా: ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్రెటీలు విడాకులు తీసుకుంటున్నారు. ప్రేమించి పెళ్లిళ్లు చేసుకుని పిల్లల్ని కన్నాక.. మ్యారెజ్ లైఫ్ సెట్ కావడం లేదంటూ విడాకులు తీసుకుని విడిపోతున్నారు. దీనిపై స్పందించిన నిర్మాత కే. రాజన్ స్టార్ హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. అలాంటి వాళ్లని ఫాలో కావద్దంటూ ఫ్యాన్స్‌కు సూచనలు ఇస్తున్నాడు.

నటుడు, నిర్మాతగా కోలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు కే. రాజన్. తాజాగా ‘కన్నీ’ అనే మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ చెన్నైలో గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌కు అతిథిగా పాల్గొన్న కే. రాజన్ మాట్లాడుతూ.. ‘ఇటీవల కాలంలో చాలామంది సెలబ్రెటీలు ప్రేమించి పెళ్లిళ్లు చేసుకుని.. పిల్లల్ని కన్న తర్వాత విడాకులు తీసుకొని విడిపోతున్నారు. వారిలో ధనుష్, ఐశ్వర్య.. అలాగే ప్రకాష్, సైంధవి వీరంత విడాకులు తీసుకుని విడిపోయి అభిమానులకు బాధను మిగుల్చుతున్నారు. అయితే ఇలాంటి హీరోలను వారి అభిమానులు ఎవరూ కూడా ఆదర్శంగా తీసుకోకూడదు. హీరోలను గుడ్డిగా నమ్మి వారిని ఫాలో అవ్వకూడదని నేను కోరుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నిర్మాత కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story

Most Viewed