బాధిత మహిళలకు ధైర్యం కల్పించాలి : రాష్ట్ర మహిళ కమిషన్ చైర్ పర్సన్ సునీత లక్ష్మారెడ్డి

by Disha Web Desk 1 |
బాధిత మహిళలకు ధైర్యం కల్పించాలి : రాష్ట్ర మహిళ కమిషన్ చైర్ పర్సన్ సునీత లక్ష్మారెడ్డి
X

దిశ, కరీంనగర్ బ్యూరో : వివిధ సమస్యలతో సఖీ కేంద్రానికి వచ్చే మహిళల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ మేము ఉన్నమంటూ ధైర్యాన్ని బాధిత మహిళలకు కల్పించాలని రాష్ట్ర మహిళ కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునీత లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులకు జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని సఖీ వన్ స్టాప్ కేంద్రాన్ని సందర్శించిన కమిషన్ సభ్యులు కేంద్రంలోని ఇద్దరు బాధిత మహిళలతో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పది రకాల సేవలను ఒకే గొడుగు క్రిందకు తీసుకువచ్చిన సఖీ కేంద్రం వివిధ సమస్యలతో సఖీ కేంద్రానికి వచ్చే మహిళల పట్ల మర్యాదపూర్వకంగా, గౌరవ ప్రదంగా ప్రవర్తించాలని, వారి సమస్యలను సానుకూలంగా విని సత్వర న్యాయం జరిగేలా సహకరించాలని సూచించారు.

వివిధ సమస్యలతో వచ్చే బాధిత మహిళలకు చట్టాలపై అవగాహన కల్పిస్తూ వారికి న్యాయం చేకూర్చాలన్నారు. జిల్లా మహిళా కారాగారంలోని 27 మంది మహిళా ఖైదీలను కలిసి వారి కేసుల వివరాలను గురించి అడిగి తెలుసుకున్నారు. వివిధ కేసుల్లో శిక్షలను అనుభవిస్తున్న వారు వారి ప్రవర్తనను మార్చుకోవాలని, ఖైదీలకు యోగాతో పాటుగా సఖీ ద్వారా లీగల్ కౌన్సిలింగ్ ఇప్పించాలని సూచించారు. ఖైదీల పిల్లలపై జైలు ప్రభావం పడకుండా వారిని రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్పించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్.వీ.కర్ణన్, సీపీ సబ్బారాయుడు, శిక్షణ సంయుక్త కలెక్టర్ నవీన్ నికోలస్, తదితరులు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story