రాష్ట్ర బడ్జెట్‌పై కామినేని సీఈవో రియాక్షన్ ఇదే

by Disha Web Desk 2 |
రాష్ట్ర బడ్జెట్‌పై కామినేని సీఈవో రియాక్షన్ ఇదే
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం హెల్త్ కేర్ రంగాన్ని పటిష్టం చేసేందుకు ఆసక్తిగా ఉన్నదని బడ్జెట్‌ను చూస్తే అర్థం అవుతున్నదని కామినేని ఆసుపత్రి సీఈవో గాయత్రి సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ. 12,161 కోట్లుకేటాయించడం గొప్ప విషయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్యరంగం పటిష్టం కావడమే కాకుండా అన్ని రకాల ఆసుపత్రులు వృద్ధి చెందే ఛాన్స్​ఉన్నదన్నారు. గడిచిన ఏడాదితో పోల్చితే 8 శాతం అదనంగా నిధులు సమకూర్చారన్నారు. మెడికల్​ కాలేజీలు, నర్సింగ్​ కాలేజీలు ఏర్పాటు చేయడం వలన గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు బలోపేతం అవుతాయన్నారు. మెరుగైన ఆరోగ్య సంరక్షణను ప్రోత్సహించడంలో కొత్త కార్యక్రమాలు, ప్రాజెక్టులను సులువుగా చేసేందుకు వెలుసుబాటు ఉంటుందన్నారు. వైద్యరంగంలో పరిశోధన పెరుగుతుందన్నారు. ఆరోగ్య సంరక్షణకు ఎక్కువ నిధులు కేటాయించినందుకు మంత్రి హరీష్​రావుకు థాంక్స్​ తెలుపుతున్నానని చెప్పారు.


Next Story

Most Viewed