ఇప్పుడు కాదు.. కడియంను అసెంబ్లీ సెషన్‌లోనే సెట్ చేసిన CM రేవంత్?

by Disha Web Desk 2 |
ఇప్పుడు కాదు.. కడియంను అసెంబ్లీ సెషన్‌లోనే సెట్ చేసిన CM రేవంత్?
X

దిశ, తెలంగాణ బ్యూరో: అధికారంలోకి వచ్చిన కొత్తలోనే కడియం శ్రీహరితో సీఎం రేవంత్ రెడ్డి చర్చలకు శ్రీకారం చుట్టారని, అవి ఫలప్రదం అయ్యేందుకు ఇన్ని రోజులు పట్టినట్టు కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలోనే కడియం, రేవంత్ మధ్య సంప్రదింపులు మొదలైనట్టు గుర్తు చేస్తున్నారు. బీఏసీ సమావేశం ముగిసిన తరువాత ఇద్దరూ ఏకాంతంగా మాట్లాడుకున్నారని, అప్పుడు కాంగ్రెస్‌లోకి రావాలని రేవంత్ ఆహ్వానించినట్టు చర్చ జరుగుతున్నది.

సైలెంట్ అయిన కడియం

‘కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో కూలిపోతుంది’ అని అందరి కంటే ముందుగా కడియం శ్రీహరి కామెంట్ చేశారు. ఆ తరువాత ఆ స్టేట్‌మెంట్ అందరి నోళ్ల నుంచి వచ్చింది. దీనిపై రెండు పార్టీల మధ్య మాటల యుద్దమే జరిగింది. అయితే గత నెల రెండో వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. సమావేశాల ఎజెండాను ఖరారు చేసేందుకు బీఏసీ సమావేశానికి బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి వచ్చారు. మీటింగ్ ముగిసిన తరువాత బయటికి వచ్చిన సీఎం రేవంత్ కడియంను వెంటబెట్టుకుని తన చాంబర్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడే ఐదారు నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. ఆ సమయంలోనే పార్టీలోకి రావాలని రేవంత్ ఆహ్వానించినట్టు తెలుస్తున్నది. ఆ తరువాత నుంచి కడియం రేవంత్ సర్కారుపై ఘాటైన విమర్శలు చేయడం తగ్గించినట్టు ప్రచారం జరుగుతున్నది.

కాంగ్రెస్‌లో కావ్యకు రాజకీయ భరోసా

కుమార్తె రాజకీయ భవిష్యత్‌పై క్లారిటీ వచ్చిన తర్వాతే కడియం పార్టీ మార్పునకు ఓకే చెప్పినట్టు తెలుస్తున్నది. బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తే, మూడో ప్లేస్ తప్పదని పలు సర్వేల్లో వెల్లడైన్నట్టు శ్రీహరి సన్నిహితులు చెబుతున్నారు. అదే కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే, కావ్య గెలుపు సులువు అవుతుందన్న నమ్మకంతోనే ఆ పార్టీలో చేరుతున్నారు. మరోవైపు టీడీపీలో ఉన్నప్పుడు కడియంకు రేవంత్ ఇచ్చిన మర్యాదనే సీఎం అయిన తరువాత ఇస్తున్నట్టు ప్రచారం ఉంది. అసెంబ్లీలో జరిగిన బీఏసీ మీటింగ్‌లో కడియంను గతంలో మాదిరిగానే ‘సార్’ అని రేవంత్ రెడ్డి సంబోదించడం పట్ల కడియంతో పాటు అక్కడున్న ఇతర లీడర్లు కూడా ఆశ్చర్యానికి గురైనట్టు తెలుస్తున్నది. ప్రతిపక్ష లీడర్‌గా ఉన్న కేసీఆర్ సభకు రాకపోవడంతో ఆయనను ఎద్దేవ చేస్తూ, కడియంను పొగడారు. సభకు రాని కేసీఆర్ కాకుండా, ఎల్ఓపీ పదవి శ్రీహరికి ఇవ్వాలని సూచించారు.



Next Story

Most Viewed