జస్టిస్​ సంతోష్ రెడ్డి పదవీ విరమణ.. సన్మానం చేసిన న్యాయమూర్తులు

by Dishafeatures2 |
జస్టిస్​ సంతోష్ రెడ్డి పదవీ విరమణ.. సన్మానం చేసిన న్యాయమూర్తులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: జస్టిస్ ఏ సంతోష్​రెడ్డి పదవీ విరమణ చేశారు.దీంతో న్యాయమూర్తుల సంఘం, హౌసింగ్ సొసైటీ ఘనంగా సన్మానించింది. తెలంగాణ న్యాయమూర్తుల సంఘం అధ్యక్షుడు నందికొండ నర్సింగ్ రావు అధ్యక్షతన ఆదివారం లక్డీకపూల్​లోని ఓ హోటల్ లో సన్మాన కార్యక్రమం జరిగింది.న్యాయమూర్తుల సంక్షేమం కోసం జస్టిస్​సంతోష్​రెడ్డి చేసిన సేవలను పలువురు న్యాయమూర్తులు కొనియాడారు.32 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో న్యాయమూర్తిగా పనిచేసి,మేజిస్ట్రేట్ కోర్టు నుండి జిల్లా కోర్టు న్యాయమూర్తి,న్యాయశాఖ కార్యదర్శి,న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి తో పాటు పలు బాధ్యతలు చేపట్టి న్యాయమూర్తులు ఎదుర్కొనే అనేక సమస్యలపై ఎంతో కృషిచేశారని పలువురు వక్తలు అభినందించారు.

ఈ సందర్భంగా సన్మాన గ్రహీత జస్టిస్ ఏ సంతోష్ రెడ్డి మాట్లాడుతూ ..తన 32 సంవత్సరాల న్యాయమూర్తిగా పొందిన అనుభవాలను పంచుకున్నారు. పదవి విరమణ పొందినప్పటికీ న్యాయమూర్తుల కష్టనష్టాలు తెలిసిన వ్యక్తిగా తన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు. తనను ప్రేమతో ఘనంగా సన్మానించిన తెలంగాణ రాష్ట్ర న్యాయమూర్తులకు కృతజ్ఞతలు తెలియజేశారు.పదవీ విరమణ తర్వాత కూడా న్యాయమూర్తుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ న్యాయమూర్తుల హౌసింగ్ సొసైటీ ఉపాధ్యక్షులు తిరుపతి, కార్యదర్శి జీవన్ కుమార్ తెలంగాణ రాష్ట్ర న్యాయమూర్తుల సంఘం ఉపాధ్యక్షులు కే ప్రభాకర్ రావు ,సుదర్శన్, న్యాయమూర్తుల సంఘం ప్రధాన కార్యదర్శి కే మురళీమోహన్ ,సహాయ కార్యదర్శులు దశరధ రామయ్య సభ్యులు వాణి, వెంకటేశ్వరరావు హౌసింగ్ సొసైటీ సభ్యులు కుంచాల సునీత కే పట్టాభిరామారావు న్యాయమూర్తుల సంఘం పూర్వ అధ్యక్షులు రాజగోపాల్ జిల్లా జడ్జిలు ప్రతిమ , శ్రీ బాల భాస్కరరావు , శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.


Next Story