ఉద్యోగులకు ఐటీ కంపెనీ షాక్.. 600 మందిని..

by Disha Web Desk 4 |
ఉద్యోగులకు ఐటీ కంపెనీ షాక్.. 600 మందిని..
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఐటీ, తదితర కంపెనీల్లో ఆర్థిక సంక్షోభం కారణంగా అందులో పనిచేసే ఉద్యోగులను సగానికి సగం మంది తొలగిస్తున్న సంగతి తెలిసిందే. ఆ కోవలోనే ప్రముఖ వీడియో గేమ్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థ ‘యూనిటీ’ మరోసారి లేఆఫ్స్‌కు శ్రీకారం చేట్టుంది. వరల్డ్‌ వైడ్‌గా ఆ సంస్థలో పనిచేస్తున్న 8 శాతం.. సుమారు 600 మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. అదే కంపెనీలో తొలి సారిగా గత ఏడాది జూన్‌లో 225 మంది సిబ్బందిని తొలగించారు.

ఈ ఏడాది 284 మందిని, తాజాగా 600 మందిని ఇంటికి పంపించేశారు. మెరుగైన ఫలితాలు సాధించేలా సంస్థలోని అన్ని విభాగాల్లో పునర్నిర్మాణం అవసరమని భావిస్తున్నామని, కాబట్టే వరుసగా మూడో దఫా ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ఆ సంస్థ సీఈవో జాన్ రిక్సిటిఎల్లో యూఎస్‌ సెక్యూరిటీ అండ్‌ ఎక్ఛేంజ్‌ కమిషన్‌ ఫైలింగ్‌లో వివరణ ఇచ్చారు. ప్రాచుర్యంలో ఉన్న సంస్థలోనే ఇలా తొలగిస్తూ ఉంటే చిన్న కంపెనీల పరిస్థితి ఏమిటని ఐటీ ఉద్యోగులు భయందోళనలో లేఆఫ్స్ భయం పట్టుకుంది.



Next Story

Most Viewed