కాంగ్రెస్ తరఫున అల్లు అర్జున్ ప్రచారం .. ఆ వీడియో పై క్లారిటీ ఇదే?

by Disha Web Desk 18 |
కాంగ్రెస్ తరఫున అల్లు అర్జున్ ప్రచారం .. ఆ వీడియో పై క్లారిటీ ఇదే?
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రస్తుతం తెలుగు రాష్టాల్లో ఎన్నికల సందడి నెలకొంది. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు, ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో తెలంగాణ, ఆంధ్రాలో ప్రచారాలు జోరందుకున్నాయి. అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇక ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. సీఎం పై రాయి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఏపీలో ఎన్నికల ప్రచారంలో సినిమా నటులు ప్రచారం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీ తరపున లోక్ సభ ఎన్నికల కోసం ప్రచారం చేస్తున్నారంటూ ప్రముఖ బాలీవుడ్ సినీ క్రిటిక్ కమాల్ ఆర్ ఖాన్ కూడా ఈ వీడియోని షేర్ చేయడంతో చాలా మంది ఇది నిజమని నమ్మేశారు. ఇంకొంతమంది అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారంటూ హిందీలో ఓ వీడియో షేర్ చేసి కామెంట్ కూడా పెట్టారు. ఇది నిజమో కాదో అని నిర్ధారించుకోకుండా అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారని వీడియో షేర్ చేస్తూ వచ్చారు. అయితే ఇందులో నిజమెంత అని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది.

ఇది ఇప్పటి వీడియో కాదని తెలిసింది. ఆ వీడియో 2022లో అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన ఇండియా డే పరేడ్ వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా అల్లు అర్జున్ పాల్గొన్న వీడియోగా బూమ్ సంస్థ నిర్ధారించింది. బూమ్ సంస్థ ఈ వీడియోని రివర్స్ సెర్చ్ చేస్తే అల్లు అర్జున్ పరేడ్ లో పాల్గొన్నట్టు ఆర్టికల్స్, ఫొటోస్ కనిపించాయి. ఆ వీడియోని 2022 వ సంవత్సరం ఆగస్టు 23న అప్లోడ్ చేశారంట. ఈ నేపథ్యంలో ఒరిజినల్ వీడియో గమనిస్తే ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో ఫేక్ అని క్లియర్ గా అర్థమవుతుంది. కాబట్టి అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేశారంటూ వైరల్ అవుతున్న వీడియో ఫేక్ అని కన్ఫామ్ అయింది. కాగా ఇలాంటి ఫేక్ వీడియోలు షేర్ చేయడం, ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం ద్వారా ఓటర్ల పై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని వీడియో చూసిన బన్నీ ఫ్యాన్స్, నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.



Next Story

Most Viewed