కాంగ్రెస్ పార్టీ ఏమైనా వాయిదాల పార్టీనా?.. బీజేపీ నేత లక్ష్మణ్ కౌంటర్

by Disha Web Desk 5 |
కాంగ్రెస్ పార్టీ ఏమైనా వాయిదాల పార్టీనా?.. బీజేపీ నేత లక్ష్మణ్ కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బోనస్ ఇవ్వమంటే వచ్చే పంటకు ఇస్తామని వాయిదా వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమైనా వాయిదాల పార్టీనా? అని బీజేపీ రాజ్యసభ ఎంపీ కే.లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై విమర్శల వర్షం గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను మళ్ళీ మోసం చేయడానికి పూనుకుంటున్నారని, ఆగస్టు 15 వరకు 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తాం అంటూ రేవంత్ మాట్లాడుతున్నాడని, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టడానికి ఐదో ఎత్తుగడ వేస్తున్నారని ఆరోపించారు.

అప్పుడు సోనియా గాంధీ జన్మదినం డిసెంబర్ 9 రోజు ఏక కాలంలో రుణ మాఫీ చేస్తా అన్నారని చెప్పారని, తర్వాత వంద రోజుల పాలన అని విఫలం అయ్యారని విమర్శించారు. అలాగే వరి పంటకు మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నారని ఇవేమీ చేయకుండా మళ్ళీ ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం పేరుతో ముందుకు వస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పుడు బోనస్ ఇవ్వలేదు కానీ వచ్చే వరి పంటకు బోనస్ ఇస్తా అంటూ వాయిదా వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమైనా వాయిదాల పార్టీ నా.? అని ఎద్దేవా చేశారు. ఎన్నికల కోడ్ పేరుతో హామీలు అమలు చేయలేకపోతున్నామని తప్పించుకుంటున్నారని, రాష్ట్ర ప్రభుత్వం వద్ద హామీల అమలుకు నిధులు లేవని తెలియదా అని ప్రశ్నించారు.

బీఆర్ఎస్ నాయకులు అవినీతిపరులు అని అనేక సార్లు విమర్శించిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు అదే బీఆర్ఎస్ ఎంఎల్ఏలను ఎలా కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారని మండిపడ్డారు. అంతేగాక కాంగ్రెస్ లో చేరగానే అవినీతి తొలిగిపోతుందా సమాధానం చెప్పాలని అన్నారు. మోదీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రజల దృష్టి మరల్చేందుకు, రాజకీయంగా ఉనికి కోల్పోయిన బీఆర్ఎస్ ని రోజూ ఏదో ఒక రకంగా తెర మీదకు తెస్తున్నారని ఆరోపించారు. కానీ మోదీ గత పదేళ్లుగా చేసిన అభివృద్ధితో మోదీ నుండి ప్రజల దృష్టి మరల్చలేరని, ప్రజలు బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకాన్ని గమనించాలని లక్ష్మణ్ కోరారు.


Next Story