కేసీఆర్ సొంత ఇలాకలో జాతీయ జెండాకు అవమానం (వీడియో)

by Dishafeatures2 |
కేసీఆర్ సొంత ఇలాకలో జాతీయ జెండాకు అవమానం (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం సొంత ఇలాక ఎర్రవల్లిలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. కొండ పోచమ్మ రిజర్వాయర్ కు వెళ్లే ప్రధాన రోడ్డు మార్గంలోని ఓ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన జాతీయ జెండా చినిగిపోయింది. అయితే ఆ జెండాను ఏర్పాటు చేసిన నాటి నుంచి దాని గురించి పట్టించుకున్నవారు లేరు. దీంతో ఎండకు ఎండి వానకు తడిసి ఆ జెండా చినిగిపోయింది. అలా చినిగిపోయిన జెండా గాలికి రెపరెపలాడుతూ కనిపిస్తోంది. ఈ ఘటన కేసీఆర్ ఫామ్ హౌజ్కు కూత వేటు దూరంలో జరిగింది. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


Next Story

Most Viewed