హైదరాబాద్ కు స్వాతంత్రం వచ్చింది సర్దార్ చొరవతోనే: Minister Kishan Reddy

by Disha Web Desk 11 |
హైదరాబాద్ కు స్వాతంత్రం వచ్చింది సర్దార్ చొరవతోనే: Minister Kishan Reddy
X

దిశ, మల్కాజిగిరి: నిజాం నిరంకుశ పాలన నుంచి హైదరాబాద్ కు స్వాతంత్రం వచ్చింది సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతోనేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. సోమవారం మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని సర్దార్ పటేల్ నగర్ లో స్థానిక కార్పొరేటర్ శ్రవణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్నిఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్రం వచ్చిన 13నెలల తరువాత హైదరాబాద్ కి స్వాతంత్రం వచ్చిందని, ఇది సర్దార్ పటేల్ చొరవతోనే జరిగిందనే విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలని సూచించారు.

దేశమంతటా స్వాతంత్ర వేడుకలలో సంబురాల్లో మునిగి ఉన్న సమయంలో తెలంగాణ మాత్రం రజాకార్ల అరాచక పాలనలో బందీగా ఉండేదన్నారు. 17 సెప్టెంబర్ 1948 న తెలంగాణకు స్వాతంత్రం వచ్చిందని, అప్పటి హోంశాఖ మంత్రి నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి తెప్పించారన్నారు. ఇప్పటీ హోంశాఖ మంత్రి అమిత్ షా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావ్, కాలనీ వ్యవస్థాపకులు జి. రామకృష్ణ, మౌలాలీ కార్పొరేటర్ సునీతా యాదవ్, వినాయక్ నగర్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి, కాలనీవాసులతో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Also Read..

KCR ఫ్యామిలీకి ఆ జైల్లో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించే బాధ్యత మాదే: రేవంత్ రెడ్డి ఫైర్

Next Story

Most Viewed