ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడొచ్చు.. ఐఎండీ కీలక ప్రకటన

by Disha Web Desk 4 |
ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడొచ్చు.. ఐఎండీ కీలక ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో : 2023లో వర్షాలు తక్కువగానే కురుస్తాయని, కరువు ఏర్పడేందుకు అవకాశం ఉందన్న ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనాలకు విరుద్ధంగా ఐఎండీ కీలక ప్రకటన చేసింది. ఈఏడాది నైరుతి రుతుపవనాల కారణంగా సాధారణ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది. భూశాస్త్ర శాఖ కార్యదర్శి ఎం. రవిచంద్రన్​ మంగళవారం ఈ విషయం వెల్లడించారు. ‘భారత్​లోని వాయవ్య, పశ్చిమ, మధ్య, ఈశాన్య ప్రాంతాల్లో సాధారణం నుంచి లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.

తూర్పు భారత్, ఈశాన్య, వాయవ్య భారత్ లోని కొన్ని ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం ఉంటుంది. వర్షాకాలంలో ఎల్​ నినో పరిస్థితులు ఏర్పడవచ్చు. రెండో సీజన్​ ఈ ప్రభావం కనిపించవచ్చు. జూన్ నుంచి సెప్టెంబ‌ర్ వ‌ర‌కు మాత్రం 96 శాతం వ‌ర్షాపాతం ఉంటుంది. జూలైలో ఎల్ నినో ప‌రిస్థితుల డెవ‌ల‌ప్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి’అని వెల్లడించారు. కాగా, భారత్​లో ఈ ఏడాది అతి తక్కువ వర్షపాతం నమోదవుతుందని, కరవు ఏర్పడేందుకు 20శాతం అవకాశాలు ఉన్నాయని స్కైమేట్ అంచనా వేసింది. కానీ, ఇందుకు కాస్త విరుద్ధంగా ఈసారి వర్షాలు సాధారణ స్థాయిలో ఉంటాయని ఐఎండీ తెలిపింది.


Next Story