పాత భవనం కూల్చుతుండగా అందులో అద్దెకుంటున్న వ్యక్తి మ‌‌ృతి

by Disha Web Desk 12 |
పాత భవనం కూల్చుతుండగా అందులో అద్దెకుంటున్న వ్యక్తి మ‌‌ృతి
X

దిశ, వెబ్‌డెస్: హైదరాబాద్‌లోని మూసాపేటలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఇంటి యజమాని తన పాత భవనాన్ని కూల్చుతుండగా.. అందులో అద్దెకు ఉంటున్న స్వామి రెడ్డి వ్యక్తి లోపల పడుకుండిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ ఇల్లు పాతబడటంతో నిన్న ఉదయం అద్దెకు ఉన్న వారిని యజమాని ఖాళీ చేయించారు. రాత్రి సమయంలో పాత ఇంటి కూల్చివేతలు యజమాని చేపట్టారు. అయితే ఇంటిని కూల్చివేస్తున్నారే విషయం తెలియని స్వామి రెడ్డి.. రాత్రి వచ్చి గదిలోనే నిద్రపోయాడు. గదిలో స్వామి రెడ్డి ఉన్నాడనే విషయం తెలియని యజమాని ఇంటిని కూల్చి వేశారు. దీంతో భవన శిథీలాలు మీదపడి స్వామి రెడ్డి మృతి చెందాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని.. ఇంటి యజమానిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.


Next Story

Most Viewed