మహిళా జర్నలిస్ట్‌లపై వస్తున్న ట్రోల్స్​ ను అరికట్టాలి : ప్రొఫెసర్ హరగోపాల్

by Disha Web Desk 15 |
మహిళా జర్నలిస్ట్‌లపై వస్తున్న ట్రోల్స్​ ను అరికట్టాలి : ప్రొఫెసర్ హరగోపాల్
X

దిశ, ఖైరతాబాద్ : మహిళా జర్నలిస్ట్‌లపై వస్తున్న ట్రోల్స్​ ను అరికట్టాలని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. సమాజంలో నైతిక విలువలు పూర్తిగా సమాధవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ సోమాజీగూడలోని ప్రెస్‌క్లబ్‌లో జర్నలిజం...ట్రోల్‌ ముఠాలు అనే అంశంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ స్టేట్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌, హైదరాబాద్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌, తెలంగాణ స్మార్ట్‌ మీడియా, మీడియం పేపర్‌, ప్రెస్‌క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన

ఈ సమావేశంలో తెలంగాణ నిర్భంద వ్యతిరేక పోరాట సమితి కన్వీనర్‌ ప్రొఫెసర్‌ హరగోపాల్‌తో పాటు పలువురు ప్రజా సంఘాల నాయకులు, సీనియర్‌ పాత్రికేయులు పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేశారు. ప్రస్తుతం సోషల్‌ మీడియా ప్రాధాన్యత పెరుగుతుందని, అదే స్థాయిలో మహిళా జర్నలిస్ట్‌ల స్వేచ్ఛ, స్వాతంత్య్రంపై విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారని మండిపడ్డారు. దీనిని అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఉపా చట్టంతో తనకు మరింత పేరు రావడంతో పాటు ధైర్యం వచ్చిందన్నారు. భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం మహిళలపై, ప్రజాస్వామ్యంపై ట్రోల్‌ చేస్తున్నారని సంధ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతులను మతవాదంతో తొక్కే ప్రయత్నం చేస్తున్నారని పలువురు అభిప్రాయపడ్డారు.

Next Story