గువ్వల బాలరాజే కనిపించిన వారిపై దాడి చేశారు: Revanth Reddy

by Disha Web Desk 16 |
గువ్వల బాలరాజే కనిపించిన వారిపై దాడి చేశారు: Revanth Reddy
X

దిశ, వెబ్ డెస్క్: నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గాయపడిన విషయం తెలిసిందే. అయితే ఆయన హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారు. గువ్వల బాలరాజు ఆస్పత్రిలో ఉండగా మంత్రి కేటీఆర్ పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులపై విమర్శలు చేశారు. దీంతో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గువ్వల బాలరాజే కనిపించిన వారిపై దాడి చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. గువ్వల బాలరాజు డబ్బులు పంచడానికి వెళ్తున్నారని పోలీసులకు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారని తెలిపారు. అయితే గువ్వల బాలరాజును అడ్డుకోకుండా పోలీసులు కాంగ్రెస్ నేతలపైనే తప్పుడు మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. గువ్వల బాలరాజును మంత్రి కేటీఆర్ పరామర్శించి కుట్రలు జరుగుతున్నాయని, తమపై ఆరోపణలు చేశారని రేవంత్ రెడ్డి అన్నారు. ఫాక్స్ కాన్‌పై మంత్రి కేటీఆర్ తప్పుడు ప్రచారం చేశారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

బెంగాల్లో మమతా బెనర్టీపై దాడి జరగడంతో ఆమె వీల్ ఛైర్‌పై ప్రచారం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ప్రశాంత్ కిషోర్ ఎక్కడ వ్యూహకర్త ఉంటే అక్కడ ఇలాంటి డ్రామాన్ కామన్ అని రేవంత్ రెడ్డి కొట్టిపారేశారు. కొత్త ప్రభాకర్ పై దాడి జరిగినప్పుడు మమత్రి హరీశ్ రావు చాలా బాగా నటించారని ఎద్దేవా చేశారు. కొత్త ప్రభాకర్ పై దాడి పీసీసీ చీఫ్ చేయించారని సీఎం కేసీఆర్ ఫ్యామిలీ ప్రచారం చేసిందని మండిపడ్డారు. సంచలనం కోసమే ప్రభాకర్ పై దాడి జరిగిందని ఆ జిల్లా ఎస్పీనే చెప్పారని గుర్తు చేశారు. ఆ ఘటనలో కాంగ్రెస్ ప్రమేయం లేదని స్పష్టంగా ఎస్పీనే చెప్పారని రేవంత్ రెడ్డి తెలిపారు. కొత్త ప్రభాకర్ పై దాడి ఘటనలో ఇప్పటివరకూ రిమాండ్ రిపోర్టు ఎందుకు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మరో 15 రోజుల్లో మూడు కుట్రలు జరగబోతున్నాయని మంత్రి కేటీఆర్ అంటున్నారని, ఎన్నికల అధికారులు ఎందుకు ఆయన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకోవడంలేదని నిలదీశారు. మేడిగడ్డ కుంగినప్పుడు తొలుత కుట్ర ఉందని, ఆ తర్వాత నిర్వహణ లోపం అంటున్నారని రేవంత్ వ్యాఖ్యానించారు.



Next Story

Most Viewed