Hyd: చంద్రబాబుతో లాయర్ సిద్ధార్థ్ లూథ్రా భేటీ.. కేసులపై సుధీర్ఘంగా చర్చలు

by Disha Web Desk 16 |
Hyd: చంద్రబాబుతో లాయర్ సిద్ధార్థ్ లూథ్రా భేటీ.. కేసులపై సుధీర్ఘంగా చర్చలు
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో 52 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా జైలు జీవితం అనుభవించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో చంద్రబాబు బెయిల్ పై విడుదల అయ్యారు. ప్రస్తుతం చంద్రబాబు హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో ఉన్నారు. దీంతో చంద్రబాబును లాయర్ సిద్ధార్థ్ లూథ్రా కలిశారు. చంద్రబాబు తరపున లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టులో దాఖలైన క్వాష్ పిటిషన్‌పై తీర్పు ఈ నెల 8న రానుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో లాయర్ సిద్ధార్థ లూథ్రా సుధీర్ఘంగా చర్చలు జరిపారు. అటు సీఐడీ పెడుతున్న వరుస కేసులపైనా చర్చించారు. ఈ కేసులను ఏ విధంగా ఎదుర్కోవాలి, ఎలాంటి వ్యూహాలను అనుసరించాలనే దానిపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసుకు సంబంధించి రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 10న ఏపీ హైకోర్టులో తీర్పు వెలువడనుంది. ఈ తీర్పును బట్టి తదుపరి వ్యూహాన్ని ఎలా అనుసరించాలనే దానిపై కూడా చర్చించనట్లు సమాచారం. సీఐడీ వరుస కేసులపై న్యాయపరంగా ఎలా ముందుకెళ్లాలనే దానిపై చంద్రబాబుతో సిద్ధార్థ లూథ్రా మూడు గంటలకు పైగా చర్చించారు. కాగా ఏపీ సీఐడీ వరుసగా చంద్రబాబుపై ఐదు కేసులు నమోదు చేసింది.



Next Story

Most Viewed